Mon Dec 23 2024 07:20:32 GMT+0000 (Coordinated Universal Time)
గల్ఫ్ కార్మికులకూ ఆ హక్కులు అమలు చేయాలి
ఫిలిప్పీన్ కేంద్రంగా పనిచేసే మైగ్రెంట్ ఫోరమ్ ఇన్ ఏసియా అనే సంస్థ నిర్వహించిన ఆగ్నేయ ఆసియా, దక్షిణ ఆసియా, గల్ఫ్ మధ్య..
ఆసియా - గల్ఫ్ దేశాల సమావేశంలో మంద భీంరెడ్డి
వలస కార్మికుల సామాజిక రక్షణ అనే అంశంపై మలేషియా రాజధాని కౌలాలంపూర్ లో జరుగుతున్న బహుళ దేశాల ప్రాంతీయ సమావేశంలో గల్ఫ్ వలస వ్యవహారాల నిపుణుడు మంద భీంరెడ్డి కి రియాక్టర్ (విషయంపై పరిజ్ఞానం కలిగి చర్చపై ప్రతిస్పందించే వ్యక్తి) గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భీం రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం ఒకనెల వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని ఉద్యోగ ఒప్పందాలలో ఉన్నప్పటికీ.. అది అమలు కావడం లేదని ఆయన తెలిపారు. గల్ఫ్ కార్మికులు స్వదేశంలో కుటుంబంతో జీవించే హక్కును కాపాడాలని ఆయన కోరారు. అంతర్జాతీయ వలస కార్మికులకు ఆన్ లైన్ ఓటింగ్ సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉందని, వచ్చే ఏడాది భారత్, ఇండోనేషియా, బాంగ్లాదేశ్ లలో జరిగే జాతీయ ఎన్నికలలో ప్రవాసుల ప్రభావం ఉంటుందని భీంరెడ్డి అన్నారు.
ఫిలిప్పీన్ కేంద్రంగా పనిచేసే మైగ్రెంట్ ఫోరమ్ ఇన్ ఏసియా అనే సంస్థ నిర్వహించిన ఆగ్నేయ ఆసియా, దక్షిణ ఆసియా, గల్ఫ్ మధ్యప్రాచ్య దేశాల ప్రతినిధుల సమావేశం ఈనెల 24, 25 రెండు రోజులు పాటు జరిగింది. లెబనాన్ రాజధాని బీరుట్ లో ఉన్న అరబ్ దేశాల ఐఎల్ఓ (అంతర్జాతీయ కార్మిక సంఘం) ప్రాంతీయ కార్యాలయం సోషల్ ప్రొటెక్షన్ టెక్నికల్ ఆఫీసర్ డా. లియాబూ కాటర్ వలస కార్మికుల సామాజిక రక్షణ (సోషల్ ప్రొటెక్షన్), సామాజిక భద్రత (సోషల్ సెక్యూరిటీ), విశ్వవ్యాప్త సామాజిక రక్షణ అంతస్తులు (యూనివర్సల్ సోషల్ ప్రొటెక్షన్ ప్లోర్స్) అంటే ఏమిటి? ఎందుకు? అనే విషయంపై వివరణాత్మకంగా ప్రసంగించారు. డా. రేణు అధికారి (నేపాల్), ఫిష్ ఐపి (ఇంటర్నేషనల్ డొమెస్టిక్ వర్కర్స్ ఫెడరేషన్), విలియమ్స్ (ఫిలిప్పీన్స్) లు వివిధ దేశాలలో ఉన్న సామాజిక రక్షణ పథకాల గురించి ఈ సమావేశంలో వివరించారు.
Next Story