Mon Dec 23 2024 05:32:37 GMT+0000 (Coordinated Universal Time)
Brazil : బ్రెజిల్ లో ఘోర విమాన ప్రమాదం.. 62 మంది మృతి
బ్రెజిల్ లో విషాదం నెలకొంది. ప్రయాణికులతో వెళుతున్న విమానం కూలిపోవడంతో 62 మంది మరణించారు. ప్రమాద సమయంలో 62 మంది విమానంలో ప్రయాణం చేస్తున్నారు
బ్రెజిల్ లో విషాదం నెలకొంది. ప్రయాణికులతో వెళుతున్న విమానం కూలిపోవడంతో 62 మంది మరణించారు. ప్రమాద సమయంలో 62 మంది విమానంలో ప్రయాణం చేస్తున్నారు. సావో పువాలో లోని విన్ హెడోలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. విమానంలో సాంకేతిక లోపం తలెత్తి ఉండవచ్చని భావిస్తున్నారు. పరానాలోని కాస్కావెల్ నుంచి సావో పాలో గౌరుల్హోన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళుతుండగా ఈ ఘటన చోటుకుంది.
నివాస ప్రాంతంలో...
విమానం నివాస ప్రాంతంలో కుప్పకూలిపోయింది. అయితే విమానం నివాసిత ప్రాంతంలో పడిన స్థానికులు ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. అక్కడ ఒక నివాస ప్రాంతం మాత్రం దెబ్బతినిందని చెప్పారు. సమాచారం అందుకున్న వెంటనే సహాయక సిబ్బంది, అధికారులు ఘటన స్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. మంటలను ఆర్పేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. అయితే ఈ విమానంమాత్రం ఎందుకు ప్రమాదానికి గురైందీ అన్న కారణాలు తెలియరాలేదని అధికారులు చెబుతున్నారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రయాణికులందరూ మరణించడంతో మృతులు ఎవరన్నది తెలిసే అవకాశముంది.
Next Story