Mon Dec 23 2024 12:02:17 GMT+0000 (Coordinated Universal Time)
పాక్ లో బాంబు పేలుడు.. భారతీయ వస్తువులు అమ్మే చోటే?
పాకిస్థాన్ లో భారీ పేలుడు జరిగింది. పేలుడులో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో ఇరవై మందికి తీవ్ర గాయాలయ్యాయి.
పాకిస్థాన్ లో భారీ పేలుడు జరిగింది. ఈ పేలుడులో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో ఇరవై మందికి తీవ్ర గాయాలయ్యాయి. లాహోర్ లోని అనార్కలీ మార్కెట్ పాన్ మండీ దగ్గర ఈ పేలుడు సంభవించింది. నిత్యం ఈ మార్కెట్ రద్దీగా ఉంటుంది. రద్దీ ఉండే ప్రాంతాన్నే దుండుగులు ఎంచుకున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఏ ఉగ్రవాద సంస్థ?
బాంబు పేలుడు జరిగిన ప్రాంతంలో ఎక్కవ భారతీయ వస్తువులు అమ్ముతుండటంతో మరిన్ని అనుమానాలు కలుగుతున్నాయి. ఈ పేలుడుకు తామే కారణమని ఈ ఉగ్రవాద సంస్థ ఇప్పటి వరకూ ప్రకటించుకోలేదు. దీంతో లాహోర్ పోలీసులు బాంబు పేలుడుపై దర్యాప్తు చేస్తున్నారు.
Next Story