Sun Mar 30 2025 04:48:47 GMT+0000 (Coordinated Universal Time)
అట్టుడికిపోతున్న శ్రీలంక
శ్రీలంకలో పరిస్థితులు మెరుగుపడలేదు. రణిల్ విక్రమ్ సింఘే అధ్యక్షుడిగా ఎన్నికవ్వడంతో ఆందోళనలు తీవ్రమయ్యాయి

ఆర్థిక పరిస్థితి పూర్తిగా క్షీణించింది. దానిని గాడిన పెట్టడానికి పాలకులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా నిరసనకారులు ఆగడం లేదు. శ్రీలంకలో పరిస్థితులు మెరుగుపడలేదు. ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. రణిల్ విక్రమ్ సింఘే అధ్యక్షుడిగా ఎన్నికవ్వడంతో ఆందోళనలు తీవ్రమయ్యాయి. భద్రతాబలగాలపై ఆందోళనకారులు రాళ్లురువ్వుతూ తమ నిరసనలను వ్యక్తం చేస్తున్నారు. నిన్న అర్థరాత్రి కొలంబో లో ఉన్న నిరసనకారులకు చెందిన టెంట్లను తొలగించి వారిని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశాయి భద్రతా బలగాలు. దీంతో భద్రతా బలగాలపై నిరసనకారులు తిరగబడ్డారు.
రాజీనామా చేసేంత వరకూ....
కొత్త అధ్యక్షుడు రణిల్ విక్రమ్ సింఘే రాజీనామా చేసేంతవరకూ తాము నిరసనలను ఆపబోమని వారు వెల్లడించారు. దీంతో నిరసనకారులు, భద్రతాదళాల మధ్య ఘర్షణ జరిగింది. ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. తమ నిరసనలను బలంగా అణగదొక్కాలని ప్రయత్నించాలని చూస్తే మరింతగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. అయినా భద్రతా దళాలు మాత్రం నిరసనకారులు ఆశ్రయం పొందిన టెంట్లను తొలగిస్తున్నారు. వారిని బయటకు పంపించేస్తుండటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Next Story