Mon Dec 23 2024 15:16:08 GMT+0000 (Coordinated Universal Time)
విషాదాన్ని నింపిన టైటాన్.. బిలియనీర్లు మృతి
అట్లాంటిక్ మహా సముద్రంలో టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు.. ఆదివారం ఐదుగురు పర్యాటకులు టైటాన్ మినీ సబ్‌మెరైన్‌లో బయలుదే
టైటానిక్ శకలాలను చూడడానికి వెళ్లిన టైటాన్ కు చెందిన శకలాలను గుర్తించారు. ఆ సబ్ మెరైన్ పేలిపోయిందని.. కాటాస్ట్రోఫిక్ ఇంప్లోషన్ జరిగిందని అమెరికా కోస్ట్ గార్డ్ ప్రకటించింది. కొద్దిరోజుల కిందట సంబంధాలు తెగిపోయిన సబ్మెర్సిబుల్ సబ్ మెరైన్ ధ్వంసమైందని.. అందులో ఉన్న ఐదుగురు మరణించారని US కోస్ట్ గార్డ్ తెలిపింది. ఉత్తర అట్లాంటిక్‌లోని టైటానిక్ శకలాల నుండి 4 కిలోమీటర్ల దూరంలో, 1,600 అడుగుల సముద్రగర్భంలో ఒక రోబోటిక్ డైవింగ్ వాహనం ఒక శిధిలాలను కనుగొన్నట్లు అమెరికా కోస్ట్ గార్డ్ అధికారులు తెలిపారు.
‘టైటాన్’ ఆదివారం తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. నీటి అడుగున 12,500 అడుగుల లోతులో ఉన్న టైటానిక్ షిప్ శిథిలాలను చేరుకునే సమయంలో ఉపరితలంతో సంబంధాలు తెగిపోయాయి. మిషన్‌ను నడిపిన ఓషన్‌గేట్ ఎక్స్‌పెడిషన్స్ నిపుణుడు కూడా టైటాన్లో ఉన్నాడని అతడు ప్రాణాలతో బయటపడలేదని ఒక ప్రకటన విడుదల చేసింది. ఓషన్‌గేట్ ఎక్స్‌పెడిషన్స్ CEO స్టాక్టన్ రష్ మిషన్ బాధ్యతలు తీసుకున్నాడు. బ్రిటిష్ బిలియనీర్, అన్వేషకుడు హమీష్ హార్డింగ్, పాకిస్థాన్‌లో జన్మించిన వ్యాపారవేత్త షాజాదా దావూద్, అతని 19 ఏళ్ల కుమారుడు సులేమాన్, ఫ్రెంచ్ సముద్ర శాస్త్రవేత్త, ప్రఖ్యాత టైటానిక్ నిపుణుడు పాల్-హెన్రీ నార్గోలెట్ మరణించారని అధికారులు తెలిపారు.
అట్లాంటిక్ మహా సముద్రంలో టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు.. ఆదివారం ఐదుగురు పర్యాటకులు టైటాన్ మినీ సబ్‌మెరైన్‌లో బయలుదేరారు. సముద్రగర్భంలో వెళ్లిన తర్వాత గల్లంతయ్యింది. అప్పటి నుంచి దాని ఆచూకీ కనుగొనడం కోసం రిమోట్ ఆపరేటెడ్ వెహికల్ని పంపించారు. టైటాన్ కు సంబంధించిన కొన్ని శకలాలను కనుగొన్నట్టు అమెరికన్ కోస్ట్ గార్డ్ ట్విటర్ మాధ్యమంగా వెల్లడించింది. ‘‘టైటానిక్ దగ్గరలో టైటాన్ సబ్‌మెరైన్‌ని వెతికేందుకు వెళ్లిన రిమోట్ ఆపరేటెడ్ వెహికల్ కొన్ని శకలాలను గుర్తించింది. నిపుణులు ఈ సమాచారాన్ని విశ్లేషిస్తున్నారు’’ అంటూ ట్వీట్ చేసింది. ఆ తర్వాత ఆ సబ్ మెరైన్ లో వెళ్లిన వ్యక్తులు చనిపోయారంటూ అమెరికా మీడియా కూడా ప్రకటించింది.
Next Story