Tue Dec 24 2024 00:16:28 GMT+0000 (Coordinated Universal Time)
అమెరికాలో మరోసారి టోర్నడో బీభత్సం.. 21 మంది మృతి
ఈ వారాంతంలో మిడ్ వెస్ట్, దక్షిణ ప్రాంతాలను తాకిన టోర్నడోల నుంచి కొందరు సురక్షితంగా బయటపడ్డారు. టోర్నడో ప్రభావంతో..
అమెరికాలో మరోసారి టోర్నడో బీభత్సం సృష్టించింది. 15 రోజుల వ్యవధిలో రెండోసారి భారీ టోర్నడో విరుచుకుపడటంతో వందలాది మంది గాయపడ్డారు. 21 మంది ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ మధ్య, తూర్పు అమెరికాలో టోర్నడో కారణంగా బలమైన సుడిగాలులు వీస్తూ.. భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగరాలు వర్షపు నీటిలో మునుగుతున్నాయి. టోర్నడో ధాటికి ఇళ్ల ముందున్న కార్లు కప్పుల్లా ఎగిరిపడ్డాయి.
టెనెస్సీ కౌంటీలో టోర్నడో ప్రభావం ఎక్కువగా ఉంది. దాదాపు 50 మిలియన్ల మందికిపైగా టోర్నడో ప్రభావానికి గురైనట్లు ఎమర్జెన్సీ మేనేజ్ మెంట్ ఏజెన్సీ తెలిపింది. ఈ వారాంతంలో మిడ్ వెస్ట్, దక్షిణ ప్రాంతాలను తాకిన టోర్నడోల నుంచి కొందరు సురక్షితంగా బయటపడ్డారు. టోర్నడో ప్రభావంతో భవనాలు, చెట్లు కుప్పకూలాయి. దాదాపు 8 రాష్ట్రాల్లో టోర్నడో ప్రభావం కనిపించింది. ఆర్కాన్సాస్ రాజధాని లిటిల్ రాక్ లో దాదాపు 2600 నిర్మాణాలకు టోర్నడో కారణంగా ముప్పు ఏర్పడినట్లు మేయర్ ఫ్రాంక్ స్కాట్ జూనియర్ వెల్లడించారు.
Next Story