Mon Dec 23 2024 13:21:42 GMT+0000 (Coordinated Universal Time)
మురికివాడలో గ్యాస్ లీక్.. 16 మంది మృతి
అక్రమంగా మైనింగ్ కార్యకలాపాలు జరుగుతున్న జోహన్నెస్ బర్గ్ కు తూర్పున ఉన్న బోక్స్ బర్గ్ జిల్లా సమీపంలోని..
మురికివాడలో గ్యాస్ లీకై ఊపిరాడక 16 మంది మృతి చెందారు. ఈ విషాద ఘటన జోహన్నెస్ బర్గ్ సమీపంలోని దక్షిణాఫ్రికా మురికివాడలో బుధవారం రాత్రి జరిగింది. అక్రమంగా మైనింగ్ కార్యకలాపాలు జరుగుతున్న జోహన్నెస్ బర్గ్ కు తూర్పున ఉన్న బోక్స్ బర్గ్ జిల్లా సమీపంలోని ఏంజైలో అనధికారిక సెటిల్ మెంట్ లో గ్యాస్ లీకైంది. దాంతో ఘటనా స్తలంలోనే 16 మంది మరణించారని, మరికొందరిని పారామెడిక్స్ సాయంతో ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నట్లు అత్యవసర సేవల ప్రతినిధి విలియం నట్లాడి తెలిపారు.
ఆసుపత్రిలో ఉన్నవారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని, మరో 11 మంది పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా.. మరణించినవారిలో ఐదుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. బుధవారం రాత్రి 8 గంటల సమయంలో గ్యాస్ పేలినట్లు కాల్ వచ్చిందని, అక్కడికి చేరుకోగానే విషపూరిత వాయువు ఉన్న సిలిండర్ నుంచి గ్యాస్ లీకేజీ అయినట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. అక్రమ మైనింగ్ కార్యకలాపాల్లో భాగంగా ఈ గ్యాస్ ను ఉపయోగిస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు.
Next Story