Sun Apr 06 2025 10:15:21 GMT+0000 (Coordinated Universal Time)
Myanmar: మయన్మార్ లో విషాదం.. పదిహేడు మంది మృతి
మయన్మార్ లో విషాదం చోటు చేసుకుంది. ఒక గ్రామంపై సైన్యం జరిపిన వైమానిక దాడుల్లో పదిహేడు మంది చనిపోయారు

Myanmar: మయన్మార్ లో విషాదం చోటు చేసుకుంది. ఒక గ్రామంపై సైన్యం జరిపిన వైమానిక దాడుల్లో పదిహేడు మంది చనిపోయారు. వీరిలో తొమ్మిది మంది చిన్నారులున్నారు. పదిహేడు మంది వైమానిక దాడుల్లో మరణించడం అమానవీయ ఘటనగా అంతర్జాతీయ సమాజం గర్హిస్తుంది. మానవహక్కుల సంఘం ఈ విషయాన్ని వెల్లడించడం విశేషం. మయన్మార్ లోని వాయువ్య ప్రాంతంలోని సగయింగ్ ప్రాంతంలో కససన్ గ్రామంలో జరిగిన వైమానిక దాడిలో ఇరవై మంది గాయపడ్డారని కూడా తెలిపింది.
గతంలోనూ...
మూడేళ్ల క్రితం అంగ్ సాన్ సూకీ ప్రభుత్వాన్ని సైన్యం తొలగించిన సంగతి తెలిసిందే. అనేక సార్లు ఇలాంటి ఘటనలు మయన్మార్ లో చోటు చేసుకున్నా సైన్యం ఎటువంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం లేదని తెలిపింది. పదిహేడు మంది పౌరులు మరణించడం అమానుషమని పేర్కొంది. దీనికి బాధ్యత ఎవరు వహిస్తారని మానవ హక్కుల సంఘం ప్రశ్నించింది. ఇప్పటికైనా నివాసిత ప్రాంతాల్లో వైమానిక దాడులు నిర్వహించే టప్పుడు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించింది.
Next Story