Wed Jan 15 2025 07:25:06 GMT+0000 (Coordinated Universal Time)
దక్షిణాఫ్రికాలో పెను విషాదం.. గనుల్లో చిక్కుకుని వంద మంది మృతి
దక్షిణాఫ్రికాలో పెను విషాదం సంభవించింది. బంగారు గనుల్లో చిక్కుకుని దాదాపు వంద మంది కార్మికులు మృతి చెందారు.
దక్షిణాఫ్రికాలో పెను విషాదం సంభవించింది. బంగారు గనుల్లో చిక్కుకుని దాదాపు వంద మంది కార్మికులు మృతి చెందారు. ఈ ఘటన ఆ దేశంలో పెను విషాదన్ని నింపింది. బంగారు గనుల్లో తవ్వకాలు చేపట్టడం మామూలే అయినా అక్కడ అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో బంగారు తవ్వకాలు జరుపుతున్నారని ఆరోపణలున్నాయి. బంగారు గనుల్లో చిక్కుకుపోయిన వారిని బయటకు తీసుకు వచ్చేందుకు ప్రభుత్వం అనేక రకాలుగా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందని చెబుతున్నారు. తొలుత ప్రభుత్వం కూడా అక్కడ సహాయక చర్యలు చేపట్టేందుకు ముందుకు రాలేదు. అయితే సివిల్ అసోసియేషన్ల వత్తిడితో ప్రభుత్వం దిగి వచ్చి గనుల్లోకి క్రేన్లను పంపింది.
అక్రమ మైనింగ్ పై...
దక్షిణాఫ్రికాలో అక్రమ మైనింగ్ అనేక ప్రాంతాల్లో జరుగుతుంది. అక్రమ తవ్వకాలను అణిచివేేందుకు ప్రభుత్వం ఆపరేషన్ క్లోజ్ ది హోల్ కార్యక్రమం రెండేళ్ల క్రితమే చేపట్టింది. అందులో భాగంగా బంగారు గనుల్లో అక్రమ మైనింగ్ చేస్తున్న దాదాపు పదమూడు వేల మందిని అరెస్ట్ చేసింది. దీంతో అరెస్ట్ కు భయపడిపోయిన కార్మికులు గనుల్లో మూడు కిలోమీటర్ల లోతులో తలదాచుకున్నారు. నెలల తరబడి అక్రమంగా బంగారం మైనింగ్ జరుగుతున్నా ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఫలించలేదు. ఆకలి, డీహైడ్రేషన్ కారణంగా కార్మికులు చనిపోయి ఉండొచ్చని అధికారుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అప్పటికీ కొందరిని సహాయక బృందాలు రక్షించాయి.
Next Story