Mon Dec 15 2025 06:08:31 GMT+0000 (Coordinated Universal Time)
America : అమెరికాలో న్యూఇయర్ వేళ విషాదం..పది మంది మృతి
కొత్త సంవత్సరం వేళ అమెరికాలో విషాదం అలుముకుంది. లూసియానా రాష్ట్రంలోని న్యూ ఆర్లీన్స్ లో ఈ ఘటన జరిగింది

కొత్త సంవత్సరం వేళ అమెరికాలో విషాదం అలుముకుంది. లూసియానా రాష్ట్రంలోని న్యూ ఆర్లీన్స్ లో ఈ ఘటన జరిగింది. ఒక వాహనం ప్రజలపైకి దూసుకు వచ్చింది. ఈ ఘటనలో పది మంది అక్కడికక్కడే మరణించారు. మరో ముప్ఫయి మంది వరకూ గాయపడ్డారు. వాహనంలో ఉన్న ఆగంతకుడు కాల్పులకు తెగపడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
వాహనంలో నుంచే కాల్పులు...
అందరూ కొత్త సంవత్సర వేడుకలను జరుపుకుంటూ ఆనందంలో ఉండగా ఒక్కసారి వాహనం దూసుకు రావడంతో అక్కడ ఆక్రందనలు మిన్నంటాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వెంటనే పోలీసులు ఆగంతకుడిపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. అయితే ఎవరు ఆగంతకుడు? ఎందుకు ఈ దారుణానికి తెగపడ్డారన్న దానిపై వివరాలు తెలియాల్సి ఉంది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. మృతులు ఎవరెవరెన్నది కూడా తెలియక అక్కడ కుటుంబ సభ్యులు ఆందోళన పడుతున్నారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now
Next Story

