Mon Dec 23 2024 11:17:48 GMT+0000 (Coordinated Universal Time)
న్యూయార్క్ లో అగ్నిప్రమాదం... 19 మంది సజీవదహనం
అమెరికాలోని న్యూయార్క్ లో విషాదం చోటు చేసుకుంది. ఒక అపార్ట్ మెంట్ లో జరిగిన అగ్నిప్రమాదంలో 19 మంది మృతి చెందారు
అమెరికాలోని న్యూయార్క్ లో విషాదం చోటు చేసుకుంది. ఒక అపార్ట్ మెంట్ లో జరిగిన అగ్నిప్రమాదంలో 19 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో 9 మంది చిన్నారులు కూడా ఉన్నట్లు సమాచారం. వీరితో పాటు దాదాపు అరవై మందికి పైగా గాయాలయ్యాయని చెబుతున్నారు.
19 అంతస్థులున్న...
అమెరికాలోని న్యూయార్క్ నగరంలోని ఒక అపార్ట్ మెంట్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 19 అంతస్తులున్న ఈ అపార్ట్ మెంట్ లోని మొదటి, రెండో అంతస్థుల్లో ఈ ప్రమాదం జరిగింది. దీంతో మిగిలిన అంతస్థుల్లో ఉన్న వారు బయటకు రావడానికి వీలు లేకుండా పోయింది. అగ్నిమాపక సిబ్బంది రెండు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.
Next Story