Wed Dec 25 2024 05:23:35 GMT+0000 (Coordinated Universal Time)
Boat Accident : పడవ మునిగి 90 మంది మృతి
పడవ మునిగి 90 మంది మరణించిన విషాదకరణ ఘటన మోజాంబిక్ లో జరిగింది.
పడవ మునిగి 90 మంది మరణించిన విషాదకరణ ఘటన మోజాంబిక్ లో జరిగింది. మొజాంబిక్ ఉత్తర్ తీరంలో పడవ మునక అనేక కుటుంబాల్లో విషాదం నింపింది. ప్రమాదం జరిగిన సమయంలో ఈ బోటులో 130 మంది ప్రయాణికులున్నారని తెలిసింది. నాంపులా ప్రావిన్స్ లోని ఒక ద్వీపానికి చేరుకోవడానికి వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే బోటులో సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది.
సహాయక చర్యలు...
91 మంది ప్రయాణికులు ఈ పడవ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. మృతుల్లో చిన్నారులు అనేక మంది ఉన్నారు. అయితే వెంటనే సహాయక చర్యలు ప్రారంభించినప్పటికీ ఐదుగురిని మాత్రం సిబ్బంది రక్షించగలిగారు. బోటు ప్రమాదంలో మునిగిపోయిన వారి కోసం ఇంకా సహాయక బృందాలు వెదుకుతూనే ఉన్నాయి. సముద్రంలో ఉన్న పరిస్థితులు సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తున్నాయని అంటున్నారు. మొత్తం మీద అత్యంత విషాదకరమైన ఘటన అని చెబుతున్నారు.
Next Story