Mon Dec 23 2024 11:50:21 GMT+0000 (Coordinated Universal Time)
పసిఫిక్ లో బద్దలైన భారీ అగ్నిపర్వతం.. సునామీ హెచ్చరికలు జారీ
అగ్నిపర్వతాలకు నెలవైన పసిఫిక్ మహాసముద్రంలో.. ఓ భారీ అగ్నిపర్వతం బద్దలైంది. టోంగాకు సమీపంలో హుంగా టోంగా-హుంగా
అగ్నిపర్వతాలకు నెలవైన పసిఫిక్ మహాసముద్రంలో.. ఓ భారీ అగ్నిపర్వతం బద్దలైంది. టోంగాకు సమీపంలో హుంగా టోంగా-హుంగా హాపై అగ్నిపర్వతం బద్దలైనట్లు టోంగా జియోలాజికల్ సర్వీసెస్ సంస్థ వెల్లడించింది. అగ్నిపర్వతం బద్దలవ్వడంతో టోంగా రాజధాని అయిన నుకులోఫాపై పెద్ద ఎత్తున బూడిద ఆవరించింది. ఆకాశంలో 20 కిలోమీటర్ల ఎత్తువరకూ బూడిద మేఘాలు ఏర్పడినట్లు ఆ సంస్థ పేర్కొంది.
Also Read : జల్లికట్టులో విషాదం.. యజమానినే హతమార్చిన వృషభం
ఈ అగ్నిపర్వతం విస్ఫోటన శబ్దాలు 8 నిమిషాల పాటు వినిపించాయి. 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫిజీ దీవుల్లోనూ ఈ విస్ఫోటనం శబ్దాలు వినిపించాయంటే.. దాని తీవ్రత ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అగ్నిపర్వతం పేలుడు ధాటికి పసిఫిక్ మహాసముద్ర తీరంలోని న్యూజిలాండ్, టోంగా, ఫిజీ వంటి దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. సముద్ర తీర ప్రాంతాల వాసులు తమ నివాసాలను వదిలి, ఎత్తయిన ప్రదేశాలకు చేరుకోవాలని పలు దేశాల్లో ప్రకటనలు జారీ అయ్యాయి.
Next Story