Wed Dec 25 2024 13:53:38 GMT+0000 (Coordinated Universal Time)
పాత సామాన్లు అమ్ముకుంటున్న ఎలాన్ మస్క్.. అందుకేనా ?
కార్యాలయంలో ఉన్న అనదపు సామాన్లను వదిలించుకునేందుకే ఇదంతా చేస్తున్న పైకి చెబుతున్నా.. శాన్ ఫ్రాన్సిస్కోలో కార్యాలయం..
స్పేస్ ఎక్స్ సీఈఓ, ప్రపంచ కుబేరుడైన ఎలాన్ మస్క్.. ట్విట్టర్ ను తిరిగి కొనుగోలు చేసినప్పటి నుండీ.. ఊహించని మార్పులు చేస్తున్నారు. సీఈఓగా బాధ్యతలు తీసుకోవడంతోనే.. ఉద్యోగులను తొలగించి షాకిచ్చారు. ఆ తర్వాత వెరిఫికేషన్ టిక్ కోసం చెల్లించే డబ్బును పెంచారు. తాజాగా.. ట్విట్టర్ ప్రధాన కార్యాలయంలో పాత సామాన్లను అమ్మకానికి పెట్టి.. మరోసారి సంచలానికి తెరలేపారు మస్క్. శాన్ ఫ్రాన్సిస్కోలోని ప్రధాన కార్యాలయంలో ఉన్న 631 సామాన్లను అమ్మకానికి పెట్టారు.
ఆ బాధ్యతల్ని కార్పొరేట్ అసెట్ డిస్పోజల్ సంస్థ.. హెరిటేజ్ గ్లోబర్ పార్టనర్స్ కు అప్పజెప్పారు. ఆ సామాన్లన్నింటినీ అమ్మేందుకు 27 గంటల ఆన్లైన్ సేల్ పెట్టగా.. బిడ్డింగ్ విధానం ద్వారా వేలం నిర్వహించింది. అమ్మకానికి పెట్టిన వాటిలో నాలుగు అడుగుల ట్విట్టర్ పిట్ట లోగో, 10 అడుగుల ఎత్తున్న ట్విట్టర్ లోగో నియాన్ లైట్, ఎస్పైసో మెషీన్లు, టీవీలు, ఓవెన్లు, టేబుల్స్, స్పీకర్లు, కిచెన్ సామాన్లు వంటివి ఉన్నాయి. కాగా.. కార్యాలయంలో ఉన్న అనదపు సామాన్లను వదిలించుకునేందుకే ఇదంతా చేస్తున్న పైకి చెబుతున్నా.. శాన్ ఫ్రాన్సిస్కోలో కార్యాలయం అద్దెను ఇంకా చెల్లించకపోవడంతో..ఆ యజమాని కేసు వెసినట్లు సమాచారం. అద్దె కట్టేందుకు సామాన్లను అమ్మేస్తున్నారన్న వాదన ఉంది.
పైగా గతేడాది 500 మంది అడ్వటైజర్లు ట్విట్టర్లో ప్రకటనలను విరమించుకోవడంతో.. 40 శాతం ట్విట్టర్ ఆదాయం తగ్గిపోయిందట. అయితే ఈ వాదనను హెరిటేజ్ గ్లోబల్ పార్టనర్స్ ప్రతినిధి ఖండించారు. ట్విట్టర్ కార్యాలయంలో సామాగ్రి అమ్మకానికి, ఆర్థిక పరిస్థితికి సంబంధం లేదన్నారు. ఈ 27 గంటల సేల్ లో నాలుగు అడుగుల ట్విట్టర్ పిట్ట లోగో ప్రతిమకు రూ.81.45 లక్షలు, ట్విట్టర్ లోగో లైట్ కు రూ.32.5 లక్షలు వచ్చాయి.
Next Story