Mon Dec 23 2024 03:51:39 GMT+0000 (Coordinated Universal Time)
ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడికీ తప్పని బ్లూటిక్ బెడద.. మస్క్ మామూలోడు కాదు
ఆఖరికి ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడైన జాక్ డోర్సే ను కూడా వదల్లేదు. షారూఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, రాహుల్ గాంధీ, క్రిస్టియానో
నేటి నుండి లెగసీ బ్లూటిక్ లను తొలగిస్తామని చెప్పిన ఎలాన్ మస్క్.. అన్నంత పనీ చేసి అందరికీ షాకిచ్చారు. ఇప్పటికే సబ్ స్క్రైబ్ చేసుకున్న ఖాతాలు మినహా.. మిగతా బ్లూ టిక్ ఖాతాలన్నింటికీ ఆ టిక్ ను తొలగించేశారు. ఆఖరికి ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడైన జాక్ డోర్సే ను కూడా వదల్లేదు. షారూఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, రాహుల్ గాంధీ, క్రిస్టియానో రొనాల్డో, బీజేపీ, కాంగ్రెస్, మాయావతి, బీటీఎస్ లాంటి ఎంతో మంది ఖాతాల బ్లూటిక్ లు సైతం ఎగిరిపోయాయి. కొంత కాలం క్రితం వరకు ట్విట్టర్ సీఈవోగా కొనసాగారు జాక్ డోర్సే. అనంతరం ఆయన స్థానంలో భారత సంతతి వ్యక్తి అయిన పరాగ్ అగర్వాల్ సీఈవోగా వచ్చారు. పరాగ్ వచ్చిన కొద్ది రోజులకే ట్విట్టర్ ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేసి.. ఊహించని మార్పులు తీసుకొచ్చాడు.
అప్పటివరకూ ఫ్రీ గా ఉన్న బ్లూ టిక్ వెరిఫికేషన్ ను.. సంస్థ ఆదాయాన్ని పెంచాలన్న పేరుతో నెలకు 8-11 డాలర్ల ఫీజు పెట్టాడు. మార్చి 1 నుండే ఈ విధానం అమల్లోకి రావాల్సి ఉండగా.. కొన్ని సాంకేతిక కారణాల వల్ల కాస్త ఆలస్యమైంది. ఇక రాత్రికి రాత్రే.. తమ ట్విట్టర్ అకౌంట్లలో బ్లూ టిక్ పోవడంతో చాలామంది షాకయ్యారు. మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు ఉండే ప్రముఖులు.. ట్విట్టర్ ఇలా చేస్తుందని ఊహించలేదు. దీంతో ట్విట్టర్ పై సెటైర్లు, మీమ్స్ ఉప్పెనలా పొంగుతున్నాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాతానూ ఎలాన్ మస్క్ వదలలేదని సెటైర్లు వేశారు. బ్లూ టిక్ ఉండాలంటే.. మస్క్ మామకు డబ్బు కట్టాల్సిందేనని ట్వీట్లు చేస్తున్నారు.
Next Story