Sun Dec 22 2024 22:39:36 GMT+0000 (Coordinated Universal Time)
భారత్ లో ట్విట్టర్ వెరిఫికేషన్ కు ఎంత ఖర్చు అవుతుందంటే..?
ట్విట్టర్ లో ఇకపై బ్లూ టిక్ కావాలంటే డబ్బులు చెల్లించాల్సిందే..! ధృవీకరణ ట్యాగ్‌తో కూడిన తన 'బ్లూ' సేవను Twitter ప్రారంభించింది. USలో $8 ఖరీదు చేసే ఈ సేవ భారతదేశంలో నెలకు ₹ 719 ఖర్చు అవుతుంది. ట్విట్టర్ లో బ్లూ టిక్ వెరిఫికేషన్ ఉన్న ఖాతాదారుల నుంచి నెలకు ఎనిమిది డాలర్లను వసూలు చేయనున్నట్లు చెప్పారు. మొన్నటివరకు అమెరికా, బ్రిటన్‌లో ఈ పెయిడ్ బ్లూ టిక్ వెరిఫికేషన్‌ను అమలు చేశారాయన. తాజాగా భారత్‌లో ఈ సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. భారత్‌లో ట్విట్టర్ బ్లూ టిక్ వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.
ఈ రోజు భారతదేశంలోని కొంతమంది వినియోగదారులు ట్విట్టర్ బ్లూకు సభ్యత్వాన్ని పొందమని కోరుతూ ప్రాంప్ట్ అందుకున్నారని ట్వీట్ చేశారు. ఈ అప్డేట్ ప్రస్తుతం ఐఫోన్లలో మాత్రమే అందుబాటులో ఉంది. రానున్న రోజుల్లో ఈ సేవ అందరికీ అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. Twitter బ్లూకు సభ్యత్వం పొందిన వినియోగదారులు ఎటువంటి ధృవీకరణ లేకుండానే 'బ్లూ టిక్' పొందుతారు. ధృవీకరించబడిన బ్యాడ్జ్‌కు నెలవారీ ఛార్జీని ప్రవేశపెట్టి ఆదాయాన్ని సొంతం చేసుకోవాలని ఎలాన్ మస్క్ అంటున్నారు. ఇప్పటి వరకు పరిమితంగా ఉన్న బ్లూ టిక్ వెరిఫికేషన్‌ను అందరికీ వర్తింపజేసినట్లు కంపెనీ యాజమాన్యం తెలిపింది. ప్రతి నెలా 719 రూపాయలను చెల్లించి ఎవ్వరైనా సరే బ్లూ టిక్ వెరిఫికేషన్ పొందవచ్చని స్పష్టం చేసింది. తొలుత- ఐఫోన్ వినియోగదారులకు ఈ సర్వీస్ అందుబాటులోకి వస్తుంది.
Next Story