Mon Dec 23 2024 07:37:01 GMT+0000 (Coordinated Universal Time)
నిలిచిపోయిన ట్విట్టర్ సేవలు
ప్రపంచ వ్యాప్తంగా ట్విట్టర్ సేవలు నిలిచిపోయాయి. దీంతో ట్బిట్టర్ అకౌంట్లన్నీ స్థంభించిపోయాయి.
ప్రపంచ వ్యాప్తంగా ట్విట్టర్ సేవలు నిలిచిపోయాయి. దీంతో ట్బిట్టర్ అకౌంట్లన్నీ స్థంభించిపోయాయి. ట్విట్టర్ అకౌంట్ దారులు తీవ్ర అసహనానికి గురయ్యారు. నిన్న రాత్రి 11 నుంచి 12 గంటల వరకూ ట్విట్టర్ సేవలు నిలిచిపోయాయి. ట్వీట్లు చేయడానికి వీలులేక యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
గంట సేపు....
టెక్నికల్ బగ్ కారణంగానే సేవలు నిలిచిపోయినట్లు యాజమాన్యం ప్రకటించింది. దాదాపు 48 వేల ఫిర్యాదులు అందినట్లు పేర్కొంది. ట్విట్టర్ లాగిన్ కూడా కాకపోవడంతో ఇబ్బంది పడ్డామని అనేకమంది ఫిర్యాదులు చేశారు. సాంకేతిక సమస్యతోనే ఈ ఇబ్బంది తలెత్తిందని, దీనిని వెంటనే పునరుద్ధరించమాని, గంట పాటు సేవలు నిలిచిపోయినందుకు క్షమించాలని ట్విట్టర్ యాజమాన్యం కోరింది.
Next Story