Mon Dec 23 2024 17:51:01 GMT+0000 (Coordinated Universal Time)
అమెరికాలో రోడ్డుప్రమాదం.. ఇద్దరు హైదరాబాదీలు మృతి
చికాగోలో నివసించే హైదరాబాద్ కు చెందిన మిన్ హాజ్ అక్తర్ ఈ వివరాలు వెల్లడించారు. ప్రమాద సమయంలో కారులో ముగ్గురు..
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. ఏప్రిల్ 24న జరిగిన ఈ ప్రమాదం ఆలస్యంగా వెలుగుచూసింది. జాన్స్ బర్గ్ హైవేపై వెళ్తోన్న కారు అదుపుతప్పి ఓ ట్రాక్టర్ ట్రెయిలర్ పైకి దూసుకెళ్లడంతో ప్రమాదం జరిగింది. లిక్ గ్రీక్ రోడ్డు- అన్నా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు హైదరాబాద్ యువకులు మరణించారు. కానీ స్థానిక పోలీసులు అందుకు సంబంధించిన పూర్తివివరాలను ఇంకా వెల్లడించలేదు.
చికాగోలో నివసించే హైదరాబాద్ కు చెందిన మిన్ హాజ్ అక్తర్ ఈ వివరాలు వెల్లడించారు. ప్రమాద సమయంలో కారులో ముగ్గురు ప్రయాణిస్తున్నట్టు వెల్లడించారు. ప్రమాదంలో మరణించిన వారిని మహమ్మద్ ఫైసల్, ఇషాముద్దీన్ గా గుర్తించారు. గాయపడిన మరో వ్యక్తి సయ్యద్ ఫైసల్ ప్రాథమిక చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఉన్నత విద్య కోసం ఈ ముగ్గురు విద్యార్థులు అమెరికాకు వెళ్లగా ఈ విషాదం చోటు చేసుకుంది. ఓ హైదరాబాద్ వ్యక్తి సహకారంతో మృతదేహాలను 25న సమాధి చేసినట్టు సామాజిక కార్యకర్త, అమ్జద్ ఉల్లా ఖాన్ తెలిపారు.
Next Story