Mon Dec 23 2024 03:52:21 GMT+0000 (Coordinated Universal Time)
జెలెన్ స్కీ కి ప్రమాదం.. కాన్వాయ్ లో కారును?
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. దీంతో ఆయనకు స్వల్ప గాయాలు కాగా వెంటనే ఆసుపత్రికి తరలించారు. జెలెన్ స్కీ ప్రయాణిస్కున్న కారును మరో కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. జెలెన్స్కీ తో పాటు ఆయన కారు డ్రైవర్ కు కూడా గాయాలయ్యాయి. వెంటనే ప్రాధమిక చికిత్స చేసిన అనంతరం అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. అయితే జెలెన్ స్కీకి తీవ్రగాయాలేవీ కాలేదని ఆయన ప్రతినిధి సెర్హీ నైకి ఫోరోవ్ తెలిపారు.
ఉన్నత స్థాయి దర్యాప్తు...
అయితే ఈ ప్రమాదం కావాలని చేశారా? అనుకోకుండా జరిగిన ఘటనా? అన్న దానిపై తేల్చేందుకు ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. అధ్యక్షుడు కాన్వాయ్ లో ఉన్న కారును ఢీకొట్టడం అంటే ఆయనను హత్య చేసేందుకు ఏదైనా కుట్ర జరిగిందా? అన్న కోణంలోనూ దర్యాప్తు సాగుతుందని తెలిపారు. కాగా రష్యా, ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే రష్యా సేనలను తరిమికొట్టి కొన్ని ప్రాంతాలను తిరిగి తమ స్వాధీనం చేసుకున్నామని ఉక్రెయిన్ అధికార వర్గాలు వెల్లడించాయి.
Next Story