Fri Nov 22 2024 12:52:03 GMT+0000 (Coordinated Universal Time)
కుప్పకూలిన హెలికాప్టర్.. హోంమంత్రి సహా 18 మంది మృతి
పెద్దఎత్తున మంటలు చెలరేగి.. ఆ దేశ హోంమంత్రి, డిప్యూటీ హోంమంత్రి సహా 18 మంది దుర్మరణం చెందారు. ఈ విషయాన్ని..
రష్యా చేసిన యుద్ధంతో.. శ్మశానాన్ని తలపిస్తోన్న యుక్రెయిన్ లో మరో ప్రమాదం సంభవించింది. హెలికాప్టర్ కుప్పకూలడంతో.. పెద్దఎత్తున మంటలు చెలరేగి.. ఆ దేశ హోంమంత్రి, డిప్యూటీ హోంమంత్రి సహా 18 మంది దుర్మరణం చెందారు. ఈ విషయాన్ని అక్కడి అధికారులు ధృవీకరించారు. రాజధాని కీవ్ సమీపంలో హెలికాప్టర్ ఓ స్కూల్ పై కూలిపోయింది. ఈ ప్రమాదంలో డెనిస్ మొనాస్టైర్క్సీ, డిప్యూటీ మినిస్టర్ యెవ్జెనీ యెనిన్ సహా.. ఇద్దరు పిల్లలు సహా 18 మంది మృతి చెందినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో మరో 29 మంది తీవ్రంగా గాయపడ్డారని కీవ్ ప్రాంతీయ సైనిక పరిపాలనా విభాగం అధిపతి ఒలెక్సీ కులేబా తెలిపారు.
హోంమంత్రి, డిప్యూటీ హోంమంత్రితో పాటు.. మంత్రిత్వ శాఖ కార్యదర్శి యూరీ లుబ్కోవిచ్ కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. హెలికాప్టర్ కిండర్ గార్టెన్ పక్కన కూలిపోవడంతో మంటలు చెలరేగాయి. దీంతో ఆ భవనంలోని చిన్నారులను సిబ్బందిని బయటకు తరలించారు. గాయపడిన వారందరినీ ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరగవచ్చని పోలీసులు పేర్కొన్నారు.
Next Story