Mon Dec 23 2024 10:40:27 GMT+0000 (Coordinated Universal Time)
రష్యా యుద్ధవిమానాన్ని కూల్చేసిన ఉక్రెయిన్ : పైలట్ మృతి
రష్యా దురాక్రమణ నేపథ్యంలో దాదాపు 1.5 మిలియన్ల మంది ఉక్రెయిన్ ను విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఉక్రెయిన్ కు సహాయం చేయాలని చూస్తే..
ఉక్రెయిన్ : రష్యా-ఉక్రెయిన్ ల మధ్య జరుగుతోన్న యుద్ధం 12వ రోజుకు చేరుకుంది. ఉక్రెయిన్ పై యుద్ధాన్ని ఆపాలని ప్రపంచ దేశాలు రష్యాకు ఎన్ని విజ్ఞప్తులు చేసినా పట్టించుకోకుండా.. వరుసగా దాడులు చేస్తూనే ఉంది. రష్యా దురాక్రమణ నేపథ్యంలో దాదాపు 1.5 మిలియన్ల మంది ఉక్రెయిన్ ను విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఉక్రెయిన్ కు సహాయం చేయాలని చూస్తే.. తీవ్ర పరిణామాలు తప్పవని పొరుగు దేశాలకు రష్యా హెచ్చరికలు జారీ చేస్తోంది.
Also Read : Ukraine War : జెలెన్ స్కీకి మోదీ ఫోన్
కాగా.. తమ దేశంపై బాంబుల వర్షం కురిపించేందుకు రష్యా ప్రవేశపెట్టిన యుద్ధవిమానాన్ని ఉక్రెయిన్ సైన్యం కూల్చేసింది. ఖార్కివ్ మీదుగా ఎగురుతున్న రష్యన్ యుద్ధ విమానాన్ని కూల్చేశామని, ఈ ఘటనలో పైలట్ చనిపోయాడని ఖార్కివ్ రీజియన్ డిఫెన్స్ హెడ్ క్వార్టర్స్ వెల్లడించింది. ఉక్రెయిన్ లోని కులినిచివ్ ప్రాంతంలో యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు తెలిపింది.
Next Story