Mon Dec 23 2024 02:54:17 GMT+0000 (Coordinated Universal Time)
విమానాలపై ఆంక్షల తొలిగింపు.. కేంద్రం కీలక నిర్ణయం
కేంద్ర పౌరవిమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా - ఉక్రెయిన్ ల మధ్య యుద్ధవాతావరణం నెలకొనడంతో ఈ నిర్ణయం తీసుకుంది
కేంద్ర పౌరవిమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా - ఉక్రెయిన్ ల మధ్య యుద్ధవాతావరణం నెలకొనడంతో ఈ నిర్ణయం తీసుకుంది. భారత్ - ఉక్రెయిన్ల మధ్య రాకపోకలను సాగించే విమానాల రాకపోకలను, సీటింగ్ పరిమితిపై ఆంక్షలను పౌరవిమానయాన శాఖ ఎత్తివేసింది. డిమాండ్ కు తగినట్లు విమానాలను , ఛార్టెట్ ఫ్లైట్ల సంఖ్యను పెంచేందుకు అనుమతి ఇచ్చింది.
యుద్ధ వాతావరణంతో....
భారత్ - ఉక్రెయిన్ ల మధ్య యుద్ధవాతావరణం అలుముకోవడంతో ప్రయాణికుల సంఖ్య కూడా పెరుగుతుంది. భారతీయులు వెనక్కు వచ్చేస్తున్నారు. ఉక్రెయిన్ లో మెడిసిన్ చదువుతున్న దాదాపు 18 వేల మంది విద్యార్థులు వెనక్కు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే అక్కడ భారత ప్రభుత్వం హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేసింది. విమాన ప్రయాణాలను కూడా సులభతరం చేసింది. విమానాల సంఖ్యను పెంచడమే కాకుండా ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయులు వెనక్కు వచ్చేందుకు అన్ని ఏర్పాట్లను భారత ప్రభుత్వం చేస్తుంది.
Next Story