అమెరికా వాటి ఆ రహస్యాన్ని బయట పెట్టడం లేదు
ఈ విశాల జగతిలో మనుషులు మాత్రమే లేరని.. ఇంకా ఎన్నో జీవరాశులు ఉన్నాయని ఎంతో మంది నమ్ముతూ ఉన్నారు.
ఈ విశాల జగతిలో మనుషులు మాత్రమే లేరని.. ఇంకా ఎన్నో జీవరాశులు ఉన్నాయని ఎంతో మంది నమ్ముతూ ఉన్నారు. ముఖ్యంగా అమెరికా లాంటి దేశాల్లో ఏలియన్స్ గురించి చర్చ చాలా రోజులుగా సాగుతూ ఉంది. అయితే అమెరికన్ అధికారులు బయటకు పొక్కనివ్వకుండా చేస్తున్నారనే వాదనలు కూడా వినిపిస్తూ ఉంటాయి. తాజాగా US మాజీ ఇంటెలిజెన్స్ అధికారి చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తూ ఉన్నాయి. అమెరికా మాజీ ఎయిర్ ఫోర్స్ ఇంటెలిజెన్స్ అధికారి డేవిడ్ గ్రుష్ అమెరికా పార్లమెంటు కాంగ్రెస్‌కు వాంగ్మూలం ఇచ్చారు. అమెరికా కొన్ని రహస్యాలని దాచుతూ ఉందని.. ఆయన కొన్ని ఆధారాలను సమర్పించారు. టాస్క్ ఫోర్స్ మిషన్ కు సంబంధించిన అత్యంత క్లాసిఫైడ్ ప్రోగ్రామ్‌లను గుర్తించామని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏలియన్స్ ఉపయోగించే వాహనం UAP(unidentified anomalous phenomenon) గురించి సమాచారం తన దగ్గర ఉందని అన్నారు. 2019లో US గూఢచారి ఉపగ్రహాలను నిర్వహించే నేషనల్ రికనైసెన్స్ ఆఫీస్ కు ఈ విషయాన్ని చెప్పానని ఆయన అన్నారు. UAP క్రాష్ రిట్రీవల్, రివర్స్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్‌కు తనకు అనుమతి రాలేదన్నారు. 1930ల నుంచే మానవేతర కార్యకలాపాల గురించి అమెరికా వద్ద సమాచారం ఉందన్నారు.