Mon Dec 23 2024 17:50:23 GMT+0000 (Coordinated Universal Time)
అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకు స్వీట్ న్యూస్
ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారం.. అమెరికాకు వెళ్లే అంతర్జాతీయ విద్యార్థుల విషయంలో ఇండియా ప్రపంచంలోనే రెండోస్థానంలో..
అమెరికా వెళ్లాలనేది ఎంతో మంది కల, కోరిక. కొందరు ఉన్నత విద్యకోసం, మరికొందరు ఉద్యోగాల కోసం అమెరికా వెళ్లాలనుకుంటారు. అలాంటి వారందరికీ అగ్రరాజ్యం తీపికబురు చెప్పింది. ఈ ఏడాది ఇండియాకు చెందిన వారికి రికార్డుస్థాయిలో 10 లక్షలకుపైగా వీసాలను జారీ చేయనున్నట్లు వెల్లడించింది. విద్యాసంవత్సరం ప్రారంభమయ్యేనాటికి భారతీయ విద్యార్థులందరికీ స్టూడెంట్ వీసాలను ఆమోదించనున్నట్లు తెలిపింది.
ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారం.. అమెరికాకు వెళ్లే అంతర్జాతీయ విద్యార్థుల విషయంలో ఇండియా ప్రపంచంలోనే రెండోస్థానంలో నిలిచింది. దక్షిణ మరియు మధ్య ఆసియా కోసం యూఎస్ అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ డొనాల్డ్ లూ మాట్లాడుతూ.. భారత్ - అమెరికా ద్వైపాక్షిక సంబంధాలకు అమెరికాలో గొప్ప మద్దతు ఉందన్నారు. భారతీయులు అధికంగా వర్క్ వీసాలకు ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. H-1B వీసా, వలసేతర వీసా, యూఎస్ కంపెనీలు ప్రత్యేక వృత్తుల్లో విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి అనుమతిస్తుంది. ఇరుదేశాల ఆర్థిక వ్యవస్థలకు కీలకమైన వర్క్ వీసాలకు తాము ప్రాధాన్యమిస్తున్నట్లు ఆయన వివరించారు. ఆయా వీసాల జారీకి కొన్ని కాన్సులేట్ లలో 60 రోజులకంటే తక్కువ సమయమే పడుతోందన్నారు.
Next Story