Fri Dec 27 2024 02:52:34 GMT+0000 (Coordinated Universal Time)
అగ్రరాజ్యం పెద్దన్న ఆరోగ్యంపై వైద్యుల కీలక ప్రకటన
గతేడాది జో బైడెన్ కరోనా బారిన పడి.. ఆరోగ్య పరమైన సమస్యలతో ఇబ్బందిపడ్డారు. ఆయన ఛాతీ నుంచి వైద్యులు..
అగ్రరాజ్యమైన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని శ్వేతసౌథం వెల్లడించింది. అధ్యక్షుడిగా విధులు నిర్వహించేందుకు ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపింది. గతేడాది జో బైడెన్ కరోనా బారిన పడి.. ఆరోగ్య పరమైన సమస్యలతో ఇబ్బందిపడ్డారు. ఆయన ఛాతీ నుంచి వైద్యులు చిన్న కణతిని తొలగించగా.. దీర్ఘకాలిక కోవిడ్ లక్షణాల నుండి విముక్తి పొందారని తెలిపారు. ‘మా అధ్యక్షుడు ఫిట్ గా ఉన్నారు. ఎటువంటి మినహాయింపులు లేకుండా తన బాధ్యతలన్నింటినీ పూర్తిగా నిర్వర్తిస్తారు’ అని వైట్ హౌస్ వైద్యుడు కెవిన్ ఓ కానర్ బైడెన్ ఆరోగ్య పరీక్ష రిపోర్టులో స్పష్టం చేశారు.
అధ్యక్షుడు బైడెన్ కు మేరీల్యాండ్ లోని వాల్టర్ రీడ్ నేషనల్ మిలిటరీ మెడికల్ సెంటర్లోని వైద్యులు మూడు గంటలపాటు వివిధ పరీక్షలు నిర్వహించారు. 2024లో బైడెన్ రెండోసారి అధ్యక్ష పదవి ఎన్నికలకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన అతి పెద్ద వయస్కుడైన బైడెన్ తనకు వయోభార సమస్యలు లేవన్నారు. కానీ మరోమారు అధ్యక్షుడిగా గెలిస్తే.. మరో నాలుగేళ్లు ఆయన దేశానికి సేవచేసే శారీరక సామర్థ్యాన్ని కలిగి ఉన్నారా అని అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నట్లు స్థానికంగా నిర్వహించిన సర్వేలే తేలింది.
Next Story