Sun Dec 22 2024 20:00:28 GMT+0000 (Coordinated Universal Time)
అక్కడ ఏకంగా 25,341 మంకీ పాక్స్ కేసులు
సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం
సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం అమెరికాలో మంకీపాక్స్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. ఈ సంవత్సరం ప్రారంభంలో అమెరికాలో మంకీపాక్స్ వ్యాప్తి చెందడం మొదలైంది. అప్పటి నుండి బుధవారం నాటికి యుఎస్ మొత్తం 25,341 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. CDC డేటా ప్రకారం, కాలిఫోర్నియాలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. అక్కడ 4,886 కేసులు నమోదయ్యాయి. న్యూయార్క్ (3,881), ఫ్లోరిడా (2,455), టెక్సాస్ (2,292), జార్జియా (1,773), ఇల్లినాయిస్ (1,300) లలో కేసులు ఉన్నాయి. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
మంకీపాక్స్ అంటువ్యాధి అనే సంగతి తెలిసిందే..! చాలా అరుదుగా ప్రాణాలు పోతూ ఉంటాయి. చాలా సందర్భాలలో రెండు నుండి నాలుగు వారాల్లో మంకీపాక్స్ నివారించబడుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ఈ వ్యాధి మరణాల రేటు 3 నుండి 6 శాతం వరకు ఉంటుంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వ్యక్తులపై తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం ఉంది.
Next Story