Fri Nov 22 2024 21:30:35 GMT+0000 (Coordinated Universal Time)
ఇజ్రాయిల్కు పెరుగుతున్న మద్దతు
ఇజ్రాయిల్ - హమాస్ ఉగ్రవాద సంస్థల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. అంతర్జాతీయ సమాాజం నుంచి ఇజ్రాయిల్కు మద్దతు పెరుగుతుంది
ఇజ్రాయిల్ - పాలస్తీనా ఉగ్రవాద సంస్థల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. అయితే మూడు రోజుల నుంచి జరుగుతున్న యుద్ధంలో ఎంతో మంది అశువులు బాశారు. అయితే ఇజ్రాయిల్ కు అంతర్జాతీయంగా మద్దతు పెరుగుతుంది. హమాస్ ఉగ్రవాదుల దాడిని అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇజ్రాయిల్ కు అన్ని దేశాలు అండగా నిలుస్తున్నాయి. జర్మనీ, అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ దేశాలు కూడా ఇజ్రాయిల్ కు తమ మద్దతును ప్రకటించాయి.
మృతుల సంఖ్య...
ఇప్పటికే హమాస్ దాడులతో పదిహేను వందల మందికి పైగా మరణించారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. అనధికారికంగా మృతుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశముంది. ఇటు ఇజ్రాయిల్, అటు పాలస్తీనాలో వందల మంది మరణించారు. వేల సంఖ్యలో ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఇక గాయపడిన వారి సంఖ్య చెప్పనవసరంలేదు. వేలల్లోనే ఈ సంఖ్య ఉంటుంది. వీరంతా వివిధ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరు కోలుకుంటుండగా, మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.
అధికారిక భవనాలు...
ఇజ్రాయిల్ కు మద్దతివ్వడమే కాకుండా అన్ని దేశాల్లో తమ ప్రభుత్వ కార్యాలయాలను, అధ్కక్ష భవనాలను నీలిరంగు వెలుగులతో ప్రదర్శించారు. నీలం, తెలుపు రంగులతో తమ అధికారిక భవనాలను మార్చి ఇజ్రాయిల్ కు తమ మద్దతు ఉందని చెప్పకనే చెప్పారు. అధ్యక్ష భవనాలు, చారిత్రక కట్టడాలు కూడా నీలం రంగులోకి మారిపోయాయి. అమెరికా అధ్యక్షుడి నివాసం వైట్ హౌస్ కూడా నీలం రంగు కాంతులతో నింపారు. ఇలా ఇజ్రాయిల్ కు అంతర్జాతీయంగా మద్దతు పెరుగుతున్నా హమాస్ తీవ్రవాదులు మాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఇప్పుుడు వివిధ దేశాల్లో ఉన్న భవనాలన్నీ ఇజ్రాయిల్ జాతీయ జెండా అయిన నీలం, తెలుపు రంగులోకి మార్చడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నెటిజెన్లు కూడా పెద్దయెత్తున ఇజ్రాయిల్ కు సపోర్టుగా నిలుస్తున్నారు.
Next Story