Tue Nov 05 2024 03:32:13 GMT+0000 (Coordinated Universal Time)
వణుకుతున్న గాజా...విద్యుత్తు సరఫరా ఆపి .. ఇజ్రాయిల్దే పైచేయి
ఇజ్రాయిల్ - హమాస్ మిలిటెంట్ల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. గాజా పట్టణంలో ఇజ్రాయిల్ మెరుపు దాడులకు దిగుతోంది
ఇజ్రాయిల్ - హమాస్ మిలిటెంట్ల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. గాజా పట్టణంలో ఇజ్రాయిల్ మెరుపు దాడులకు దిగుతోంది. ఇప్పటికే గాజా నగరాన్ని తమ స్వాధీనం చేసుకునే దిశగా ఇజ్రాయిల్ సైన్యం ప్రయత్నిస్తుంది. వరస దాడులతో గాజా పట్టణం కాల్పుల మోతతో దద్దరిల్లిపోతుంది. గాజా శవాల దిబ్బగా మారింది. వైమానిక దాడులు కూడా చేస్తుండటంతో అనేక భవనాలు నేలమట్టమవుతున్నాయి. వందల సంఖ్యలో హమాస్ మిలిటెంట్ల మృతదేహాలు భవనాల కింద ఉన్నట్లు ఇజ్రాయిల్ సైన్యం గుర్తించింది. గాజా పట్టణంలో విద్యుత్తు సరఫరాను, మంచి నీటిని ఇజ్రాయిల్ సైన్యం నిలిపేసింది. దాడులకు దిగుతుంది.
వెంటాడి.. వేటాడి...
హమాస్ సైన్యాన్ని వెంటాడి వేటాడి ఇజ్రాయిల్ సైన్యం చంపేస్తుంది. ఆ వీడియోలో పోస్టులు చేస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకూ 900 మంది వరకూ హమాస్ మిలిటెంట్లను హతం చేశామని ఇజ్రాయిల్ సైన్యం ప్రకటించింది. బందీలుగా ఉన్న ఇజ్రాయిల్ పౌరులను వదిలిపెట్టకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేసింది. ఒక్కరు కూడా ప్రాణాలతో బయటకు వెళ్లలేరని వార్నింగ్ ఇచ్చింది. తమ పౌరులను వెంటనే విడుదల చేయాలని కోరింది. గాజా అతి చిన్న పట్టణం. జనాభా మాత్రం అధికం. అందుకే ఇంత నష్టం జరిగిందని అంటున్నారు.
విడుదల చేయాలంటూ...
గాజా బాంబు దాడులతో దద్దరిల్లుతుంది. గాజా సరిహద్దు ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకున్నామని ఇజ్రాయిల్ సైన్యం ప్రకటించుకుంది. త్వరలోనే గాజాను కూడా స్వాధీనం చేసుకుంటామని చెబుతోంది. హమాస్ మిలిటెంట్ల కోసం గాజా సైన్యం జల్లెడ పడుతుంది. ఎక్కడ కనిపించినా కాల్చిపాడేస్తుంది. తమ దేశం విడిచి వెళ్లకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేసింది. హమాస్ మిలిటెంట్లు యుద్ధం మొదలుపెట్టినా కాస్త తేరుకుని ఇజ్రాయిల్ ప్రతీకార దాడులకు దిగుతుంది. ఇప్పటి వరకూ ఇరు దేశాలకు చెందిన మూడు వేల మంది మృత్యువాత పడినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. యుద్ధం మరికొంత కాలం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Next Story