Mon Dec 23 2024 03:13:15 GMT+0000 (Coordinated Universal Time)
మైదానాన్ని అడవిగా మార్చి...?
ప్రపంచంలో అడవులు అంతరిస్తున్న వేళ ఆ భార్యాభర్తలు శ్రమించిన తీరు అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది.
ప్రపంచంలో అడవులు అంతరిస్తున్న వేళ ఆ భార్యాభర్తలు శ్రమించిన తీరు అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. మానవాళి బతకాలంటే అడవులను సంరక్షించుకోవాలని ఈ జంట నినాదంగా ఎంచుకుంది. మోడువారిన ప్రాంతాన్ని అడవిగా మార్చడంలో ఆ జంట సక్సెస్ అయింది. బ్రెజిల లో జరిగిన ఈ ఘటనపై ఇప్పుడు సర్వత్రా ప్రశంసలు అందుతున్నాయి. బ్రెజిల్ ప్రాంతంలో అడవులు అంతరించి పోవడం చూసిన జంట లెలియా వానిక్, సెబాస్టియో జంట మొక్కలను నాటేందుకు ముందుకు వచ్చింది. 2001లో ఈ జంట మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2019 నాటికి వారు రెండు మిలియన్ల మొక్కలు నాటారు. అవి పెరిగి పెద్ద అడవిగా మారాయి.
తిరిగి జంతువులకు....
అడవిగా మలచడంలో ఈ జంట సక్సెస్ అయింది. అంతరించిపోతున్న జంతు జీవాలు తిరిగి చేరుకున్నాయి. ఇరవై ఏళ్లలో ఈ జంట నాటిన మొక్కలతో మైదానం ప్రాంతం మొత్తం అడవిగా మారిపోవడంతో అనేక 172 రకాలు పక్షులు తిరిగి అటవీ ప్రాంతానికి వచ్చి చేరాయి. అంతరించిపోతున్న అటవీ సంపదను తిరిగి నిలబెట్టిన ఈ జంటకు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని వీరు కోరుతున్నారు. ఈ జంట ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిగా నిలుస్తుంది.
Next Story