Mon Nov 04 2024 18:16:51 GMT+0000 (Coordinated Universal Time)
డొనాల్డ్ ట్రంప్ ను చంపేస్తాం : ఇరాన్ హెచ్చరిక
ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో.. 2020లో బాగ్దాద్‌లో డ్రోన్ దాడిలో ఇరాన్ మిలిటరీ కమాండర్ ఖాసిమ్ సులేమానీని..
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను చంపేస్తామని ఇరాన్ బహిరంగ హెచ్చరిక చేసింది. ఇరాన్ టాప్ కమాండర్ అయిన సలేమానీ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ వైమానిక దళ చీఫ్ అమీరాలి హజిజాదే వెల్లడించారు. ట్రంప్ ను చంపేందుకే అత్యంత ప్రమాదకరమైన క్రూయిజ్ క్షిపణిని అభివృద్ధి చేసినట్లు అమీరాలి తెలిపారు. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ క్షిపణి ఆయుధాగారంలో 1,650 కి.మీ పరిధిగల అత్యంత ప్రమాదకరమైన క్రూయిజ్ క్షిపణిని చేర్చామన్నారు.
ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో.. 2020లో బాగ్దాద్‌లో డ్రోన్ దాడిలో ఇరాన్ మిలిటరీ కమాండర్ ఖాసిమ్ సులేమానీని అమెరికా బలగాలు హతమార్చిన విషయం విధితమే. తాజాగా.. ఆ ఘటనపై ఇరాన్ టాప్ కమాండర్ ఆ దేశ మీడియాతో మాట్లాడుతూ.. ఇరాన్ అమాయక సైనికులను చంపాలని భావించడం లేదన్నారు. కానీ బాగ్దాద్‌లో 2020 డ్రోన్ స్ట్రైక్‌లో ఖాసీమ్ సులేమానీని హతమార్చినప్పుడు యూఎస్ దళాలపై బాలిస్టిక్ క్షిపణుల ద్వారా ప్రతీకారం తీర్చుకుందని హజీజాదే చెప్పారు. దేవుడు కోరుకుంటే మేము ట్రంప్ ను చంపుతాం. మాజీ విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపియో, సులేమానీని చంపమని ఆదేశించిన సైనిక కమాండర్లను చంపాలని చూస్తున్నామని తెలిపారు.
- Tags
- iran
- donald trump
Next Story