Tue Nov 05 2024 16:45:49 GMT+0000 (Coordinated Universal Time)
18 లక్షల అకౌంట్లను బ్యాన్ చేసిన వాట్సాప్
వాట్సప్ నుంచి యాక్షన్ తీసుకోమంటూ వచ్చిన కంప్లైంట్లు ఉంటాయి. ఇదే ప్లాట్ ఫాం మీద దుర్భాషలాడిన వ్యక్తులపై
ఐటీ రూల్స్ 2021ను ఉల్లంఘించిన అకౌంట్లను నవంబరులో బ్యాన్ చేసినట్లు వాట్సాప్ యాజమాన్యం వెల్లడించింది. మొత్తం 17 లక్షల 59 వేల అకౌంట్లను తొలగించడంతో పాటు 602 గ్రీవెన్స్ రిపోర్టులు సబ్ మిట్ చేశారు. వాట్సాప్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా.. ఐటీ రూల్స్ 2021 ప్రకారం.. " యూజర్ సేఫ్టీ ఆధారంగా నవంబరు నెలలో ఆరో నెల రిపోర్టు కూడా సబ్మిట్ చేశాం. ఇందులో వాట్సప్ నుంచి యాక్షన్ తీసుకోమంటూ వచ్చిన కంప్లైంట్లు ఉంటాయి. ఇదే ప్లాట్ ఫాం మీద దుర్భాషలాడిన వ్యక్తులపై తగిన యాక్షన్ తీసుకోవాలని ఉన్నట్లు " పేర్కొంది.
Also Read : జనవరి 10 వరకూ పాఠశాలలకు సెలవులు.. !
అసభ్య పదజాలం వాడే కామెంట్లను ఫిల్టర్ చేయడంలో వాట్సప్ ఇండస్ట్రీలోనే లీడర్ గా మారింది. సంవత్సరాలుగా ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్, స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ టెక్నాలజీ, డేటా సైంటిస్ట్స్ అండ్ ఎక్స్పర్ట్స్ లను పెట్టుబడిగా ఉంచి యూజర్ల సేఫ్టీని పర్యవేక్షిస్తుంది. అలాగే అనధికారికంగా బల్క్ మెసేజ్ లుగా చేసే 95శాతం స్పామ్ మెసేజ్ లకు చెక్ పెట్టింది వాట్సప్.
Next Story