పెరిగిపోతున్న మంకీపాక్స్.. లైంగిక సంపర్కం విషయంలో జాగ్రత్త అంటున్న నిపుణులు
చాలా దేశాల్లో ఎంతో వేగంగా పరుగులు పెడుతూ ఉన్నాయి. అమెరికా, ఐరోపా దేశాల నుండి 14 దేశాలకు ఈ వైరస్ పాకింది. మొత్తంగా 180 కేసులు నమోదయ్యాయి.
మంకీపాక్స్ విపరీతంగా పెరిగిపోతోంది. చాలా దేశాల్లో ఎంతో వేగంగా పరుగులు పెడుతూ ఉన్నాయి. అమెరికా, ఐరోపా దేశాల నుండి 14 దేశాలకు ఈ వైరస్ పాకింది. మొత్తంగా 180 కేసులు నమోదయ్యాయి. యూరప్‌లోని 9 దేశాల్లో 100కుపైగా కేసులు నమోదయ్యాయి. జర్మనీ, స్పెయిన్, ఫ్రాన్స్, బెల్జియం, ఇటలీ, నెదర్లాండ్స్, పోర్చుగల్, స్వీడన్, యూకే దేశాల్లో కేసులు నమోదయ్యాయి. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాల్లోనూ మంకీపాక్స్ కేసులు వెలుగుచూసినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. కేసులు క్రమంగా పెరుగుతున్నాయని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయంలోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. నైజీరియా నుంచి బ్రిటన్‌కు వచ్చిన ఒక వ్యక్తికి మంకీపాక్స్ లక్షణాలు తొలుత మే 7న గుర్తించారు. ఆ తర్వాత ఊహించని విధంగా పెరిగిపోయాయి. ఆఫ్రికా, పశ్చిమ దేశాల్లో మంకీపాక్స్ సాధారణమే అయినప్పటికీ గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో విస్తరించలేదని నిపుణులు అంటున్నారు.