అదుపులోకి రాని గ్రీస్ కార్చిచ్చు..
గ్రీసులో చెలరేగిన కార్చిచ్చు..ఐరోపా ఖండంలో ఎన్నడూ సంభవించలేదని ఐరోపాయూనియన్ వెల్లడించింది
అదుపులోకి రాని గ్రీస్ కార్చిచ్చు..
గ్రీసులో చెలరేగిన కార్చిచ్చు..ఐరోపా ఖండంలో ఎన్నడూ సంభవించలేదని ఐరోపాయూనియన్ వెల్లడించింది. ఈ మంటలను అదుపులోకి తెచ్చేందుకు గ్రీస్ నానా తంటాలు పడుతోంది. 2000 సంవత్సరం నుంచి ఇప్పటివరకు అనేక దేశాల అడవుల్లో చెలరేగిన మంటల్లో ఇదే అతి పెద్దదని ఐరోపా పౌర రక్షణ విభాగం చెబుతోంది. ఆగస్టు 19 నుంచి గ్రీసు దండకారణ్యం తగలబడుతోంది. దాదాపు 310 చదరపు మైళ్లు మంటలకు ఆహుతైయ్యిందని, అంటే న్యూయార్క్ లో జరిగిన అగ్నిప్రమాదం కంటే పెద్దదని చెబుతున్నారు. ఈ అగ్నికీలకాల్లో టర్కీకి 20 మంది పారిపోతుండగా, 18 మంది మాడిమసైపోయారు. గ్రీస్ లోని ఈశాన్య ప్రాంతంలో దడియా నేషనల్ పార్క్ లోని పక్షులన్నీ అగ్నికి ఆహుతయ్యాయి.
యూరోపియన్ కమిషన్ అధికార ప్రతినిధి బలజ్స్ ఉజ్వరి మాట్లాడుతూ దేశంలోని సగం ఫైరింజన్లు మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఈనెల 19 నుంచి ప్రయత్నిస్తున్నాయన్నారు. అదనంగా ఐరోపా దేశాలు 11 నీటిని మోసుకెళ్లే విమానాలను, ఒక హెలికాఫ్టర్ ను, 407 అగ్నిమాపక శకటాలతో అగ్నిమాపక దళాలను దడియా పంపాయని ఉజ్వరి తెలిపారు. పరిసర ప్రాంతాలకు అగ్నికీలకాలు వ్యాప్తి చెందకుండా మరో 28 ఎయిర్ క్రాఫ్టలను, 24 వాటర్ డంపింగ్ ఫ్లయిట్లను పంపామన్నారు. అయినా మంటలు అదుపులోకి రావడం లేదని, ఈయూ (యురోపియన్ యూనియన్) 2030 నాటికి మరో 12 ఎయిర్ క్రాఫ్టుల కోసం ఫండు సమకూర్చిందని తెలిపారు.
ఆపత్కాల సమయంలో గ్రీస్ కు సంపూర్ణ మద్దతు ఇస్తామని ఈయూ అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది ఎండాకాలంలో ఐరోపాలోని చాలా దేశాలు కార్చిచ్చుకు బలయ్యాయి. ఇది పర్యావరణం, వాతావరణ సంక్షోభానికి ఇవి దారితీస్తాయని ప్రభుత్వ పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఐరోపా దేశాలన్నీ సంయుక్తంగా చర్యలు చేపట్టాలని ఈయూ మేనేజ్మెంట్ కమిషనర్ జన్జ్ లెనర్సిక్ అన్నారు.