Mon Nov 18 2024 21:53:03 GMT+0000 (Coordinated Universal Time)
ఏం ఫర్వాలేదు.. ఒమిక్రాన్ నుంచి సులభంగానే కోలుకోవచ్చు !
ఒమిక్రాన్ సోకినవారిలో చాలా తక్కువ మందికే ఐసీయూ చికిత్స అవసరమైందన్న ఆయన.. ఇప్పటికే కోవిడ్ టీకా తీసుకున్న వారిలో
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. కరోనా, ఒమిక్రాన్ ధాటికి అగ్రరాజ్యంతో పాటు బ్రిటన్ దేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే.. ఒమిక్రాన్ మొదటగా వెలుగుచూసిన దక్షిణాఫ్రికా వైద్యులు మాత్రం.. ఏం ఫర్వాలేదు ఒమిక్రాన్ నుంచి సులభ చికిత్స ద్వారా కోలుకోవచ్చని చెప్తున్నారు. దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ ను ముందుగా గుర్తించిన డాక్టర్ ఏంజెలిక్ కోయెట్జీ సాధారణ చికిత్సతోనే నయం చేయవచ్చని తెలిపారు.
తలనొప్పి, అలసట, ఒళ్లునొప్పులే అధికం
కార్టిసోన్ అనే స్టెరాయిడ్ ను స్వల్ప మోతాదులో ఇస్తూ.. తలనొప్పి, కండరాల నొప్పులకు ఉపశమనంగా ఐబూప్రోఫెన్ తో చికిత్స చేస్తున్నామన్నారు. చాలా కేసుల్లో తలనొప్పి, అలసట, ఒళ్లు నొప్పులే కనిపించాయని డాక్టర్ ఏంజెలిక్ వివరించారు. ఒమిక్రాన్ సోకినవారిలో చాలా తక్కువ మందికే ఐసీయూ చికిత్స అవసరమైందన్న ఆయన.. ఇప్పటికే కోవిడ్ టీకా తీసుకున్న వారిలో మాత్రం వ్యాధి లక్షణాలు స్వల్పంగానే ఉన్నాయని తెలిపారు. ఒకరకంగా ఇది శుభవార్తే అయినప్పటికీ.. ఒమిక్రాన్ తీవ్రత ఎక్కువగా ఉన్న దేశాలు మాత్రం భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటున్నాయి. ఇప్పటికే చాలా దేశాలకు విస్తరించిన ఒమిక్రాన్.. రోగనిరోధక వ్యవస్థకు దొరక్కుండా శరీరంలో వ్యాప్తిచెందుతోందని వైద్యులు చెప్తున్నారు.
Next Story