Fri Nov 08 2024 20:34:21 GMT+0000 (Coordinated Universal Time)
పాత కారునంబర్ తో లాటరీ కొంటే.. రూ.40 లక్షలు తగిలింది !
అమెరికాకు చెందిన 43 ఏళ్ల మహిళ డబ్బు కోసం చాలా ఇబ్బందులు పడుతోంది. ఈ క్రమంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుందామనుకుని..
అదృష్టం మనం కావాలనుకున్నపుడు కలిసిరాదు. అది రావాలనుకున్నపుడు తలుపు తడుతుంది. తీస్తే అంతా మంచే జరుగుతుంది. రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడేవాళ్లు.. ఏ లాటరీనో తగిలి ఒక్కసారిగా డబ్బొస్తే ఎంతబాగుండు. ఉన్న అప్పులన్నీ తీర్చుకుని, పిల్లల్ని చదివించుకోవాలని అనుకుంటుంటారు. అలా ఓ మహిళకు అనుకోకుండా లాటరీ తగిలింది. ఒకటి కాదు.రెండు కాదు.. ఏకంగా రూ.40 లక్షలు. తన పాత కారునంబర్ తో ఉన్న లాటరీ టికెట్ కొనగా.. ఆ లాటరీ అదృష్టాన్ని మూటగట్టుకొచ్చింది.
అమెరికాకు చెందిన 43 ఏళ్ల మహిళ డబ్బు కోసం చాలా ఇబ్బందులు పడుతోంది. ఈ క్రమంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుందామనుకుని.. మేరీల్యాండ్ కు సమీపంలోని బాల్టిమోర్ లో ఓ ఫుడ్ స్టాప్ కు సామాగ్రి కోసం వెళ్లినప్పుడు.. కేవలం ఒక్క డాలర్ (మన కరెన్సీలో రూ.80) పెట్టి మేరీలాండ్ స్టేట్ లాటరీ టికెట్ ను కొనుగోలు చేసింది. ఈ సమయంలో తన పాత కారు నంబర్ కు అనుగుణంగా.. ఐదు నంబర్లతో కూడిన టికెట్ ను తీసుకుంది. ఆ తర్వాత తీసిన లాటరీల డ్రా లో ఆ మహిళకు ఏకంగా రూ.50 వేల డాలర్ల (మన కరెన్సీలో సుమారు రూ.40 లక్షలు) బహుమతి తగిలింది. కానీ ఆమె తొలుత దానిని నమ్మలేదట.
ఒకటికి రెండు సార్లు నంబర్ ను సరిచూసుకున్నా.. మరోసారి తన తల్లికి ఇచ్చి చూసి చెప్పమంది. నిజంగానే లాటరీ తగిలిందని చెప్పడంతో.. ఆ మహిళ ఆనందానికి అవధుల్లేవు. లాటరీ డబ్బులతో తన అప్పుల్ని తీర్చుకుని, ఇంటికి మరమ్మతులు చేయించుకుంటానని తెలిపింది. అలాగే కొత్తకారు కొనుక్కుని తన పిల్లలకి బహుమతులు కూడా తెస్తానంది.
Next Story