Mon Dec 23 2024 09:09:11 GMT+0000 (Coordinated Universal Time)
ఐదు రోజులు కాదు... 14 రోజుల క్వారంటైన్ బెటర్
పథ్నాలుగు రోజుల క్వారంటైన్ ఉంటేనే మంచిదని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా విస్తరిస్తుంది. రోజుకు లక్షల సంఖ్యలో కేసులు వెలుగు చూస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికా తో పాటు ఫ్రాన్స్ వంటి దేశాల్లో రోజుకూ ఐదు నుంచి పదిలక్షల కరోనా కేసులు నమోదవుతున్నాయి. థర్డ్ వేవ్ ప్రారంభమయిందని నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నా భౌతికదూరాన్ని పాటిస్తూ విధిగా మాస్క్ ను ధరించాలని కోరుతున్నారు.
ఆ దేశాల ఇష్టమైనా....?
ఈ నేపథ్యంలో ఇప్పుడు సోకుతున్న కరోనాతో ఐదు నుంచి ఏడు రోజుల్లోనే కోలుకుంటున్నారు. అయినా పథ్నాలుగు రోజుల క్వారంటైన్ ఉంటేనే మంచిదని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. ఐదు రోజుల్లోనే కోలుకున్నా వైరస్ శరీరంలోనే ఉంటుందని, బయటకు రాకపోవడమే మంచిదని పేర్కొంది. క్వారంటైన్ సమయాన్ని కొన్ని దేశాలు ఐదు రోజులకు కుదించడంపై డబ్ల్యూహెచ్ఓ ఈరకంగా స్పందించింది. క్వారంటైన్ గడువు ఎన్ని రోజులు ఉండాలన్నది ఆ యా దేశాల నిర్ణయమైనా, 14 రోజుల క్వారంటైన్ ఉంటేనే మేలని సూచించింది.
- Tags
- w.h.o
- quarantine
Next Story