Mon Dec 23 2024 03:43:36 GMT+0000 (Coordinated Universal Time)
కరోనా కొత్తవేరియంట్.. ప్రతి ముగ్గురిలో ఒకరు మృతి
మరో కొత్తవేరియంట్ ను కనుగొన్నారు వూహాన్ సైంటిస్టులు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో కనిపిస్తున్న నియో కోవ్ (NeoCov) అనే వేరియంట్ అత్యంత
2019లో చైనాలోని వుహాన్ లో పుట్టిన కరోనా ఇప్పుడు ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. కొత్త కొత్త వేరియంట్లతో అందరిలోనూ గుబులు రేపుతోంది. తాజాగా మరో కొత్తవేరియంట్ ను కనుగొన్నారు వూహాన్ సైంటిస్టులు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో కనిపిస్తున్న నియో కోవ్ (NeoCov) అనే వేరియంట్ అత్యంత ప్రమాదకరమైనదని సైంటిస్టులు భావిస్తున్నారు. సౌతాఫ్రికాలోని గబ్బిలాల్లో కనుగొన్న ఈ వైరస్ వల్ల హైడెత్, ట్రాన్స్ మిషన్ రేటు.. రెండూ ఎక్కువగానే ఉన్నాయని హెచ్చరించారు. నియో కోవ్ పూర్తిగా కొత్తవేరియంట్ అని సైంటిస్టుల పరిశోధనల్లో తేలింది. అలాగే దానికి సంబంధించిన పలు ముఖ్య విషయాలు పరిశోధనలో వెల్లడైనట్లు రష్యా అధికారిక మీడియా సంస్థ వెల్లడించింది.
ప్రస్తుతం జంతువుల వరకే పరిమితమైన ఈ వైరస్ ఇంకా మనుషులకు వ్యాప్తి చెందకపోవడం శుభపరిణామంగా భావిస్తున్నట్లు పరిశోధకులు చెప్పారు. ఈ వైరస్ మనుషులకు పూర్తిగా సోకదని మాత్రం చెప్పలేకపోతున్నారు. గబ్బిలాల్లోని యాంజియోటెన్సిన్ - కన్వర్టింగ్ ఎంజైమ్ పై ఈ వైరస్ ప్రభావం ఉంటుందని సైంటిస్టులు తెలిపారు. 2012, 2015లలో మిడిల్ ఈస్ట్ దేశాల్లో కనిపించిన.. మెర్స్ – కోవ్ మాదిరిగా భిన్నమైనదే కాకుండా ప్రమాదకరమైనదిగా హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్ గనుక మనుషులకు సోకినట్లైతే.. ప్రతి ముగ్గురిలోనూ ఒకరు చనిపోవడం ఖాయమని వూహాన్ సైంటిస్టులు హెచ్చరించారు.
Next Story