Mon Dec 23 2024 02:10:45 GMT+0000 (Coordinated Universal Time)
TWITTER : డిస్కౌంట్ లేదా మస్క్ ? ZOMATO క్రేజీ ట్వీట్
బ్లూటిక్ ఛార్జీలపై డిస్కౌంట్ ఇస్తే ఎలా ఉంటుంది అంటూ క్రేజీ ట్వీట్ చేసింది జొమాటో. ‘ఓకే ఎలాన్, 8 డాలర్లలో 60 శాతం..
సోషల్ మీడియా దిగ్గజాలలో ఒకటైన్ ట్విట్టర్ ను ఎలాన్ మస్క్ తిరిగి తన సొంతం చేసుకున్నాక.. ఊహించని ఎన్నో మార్పులకు తెరతీశారు. వాటిలో ఒకటి.. ట్విట్టర్ బ్లూటిక్ కు ఛార్జీల పెంపు. బ్లూ టిక్ కావాల్సిన సెలబ్రిటీలు, యూజర్లంతా ప్రతినెలా 8 డాలర్లు చెల్లించాలని లేదంటే.. బ్లూటిక్ ను కోల్పోతారని మస్క్ ప్రకటించిన విషయం తెలిసిందే. మస్క్ ఏంటి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని అందరూ షాకయ్యారు. తాజాగా ఈ అంశంపై ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో ఆసక్తికర ట్వీట్ చేసింది.
బ్లూటిక్ ఛార్జీలపై డిస్కౌంట్ ఇస్తే ఎలా ఉంటుంది అంటూ క్రేజీ ట్వీట్ చేసింది జొమాటో. 'ఓకే ఎలాన్, 8 డాలర్లలో 60 శాతం తగ్గింపు ఇస్తే ఎలా ఉంటుంది..? 5 డాలర్ల వరకు?'అని జొమాటో చేసిన ట్వీట్.. నెట్టింట శరవేగంగా వైరలవుతోంది. మస్క్ అయితే దీనిపై ఇంకా స్పందించలేదు కానీ.. జొమాటో మాత్రం ట్విట్టర్ బ్లూటిక్ ఛార్జీల పెంపుపై మంచి చర్చకు తెరతీసిందని కొందరు అభిప్రాయ పడుతున్నారు. జొమాటో చేసిన ఈ ట్వీట్ పై ఓ యూజర్'TESLA లేదంటే doggy అనే కూపన్ కోడ్ అప్లయ్ చేయండి' అంటూ చమత్కారంగా కామెంట్ చేశాడు. దీనికి మరో యూజర్ స్పందిస్తూ తప్పకుండా 60 శాతం డిస్కౌంట్ తర్వాత 3.2 డాలర్లు అవుతుంది. దీనికి 2.4 డాలర్లను ప్యాకేజింగ్ అండ్ హ్యాండ్లింగ్ చార్జీలు, డెలివరీ చార్జీల కింద మరో 2.4 డాలర్లను కలపండి. మొత్తం 8 డాలర్లు అవుతుంది. మీరు మా సేవను ఆనందించారని భావిస్తున్నాం' అంటూ ట్వీట్ చేశాడు.
Next Story