Fri Dec 20 2024 17:59:17 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2024 : దినేష్ కార్తీక్ ను దుమ్మెత్తి పోస్తున్న బెంగళూరు అభిమానులు
ఐపీఎల్ లో నిన్న జరిగిన కోల్కత్తా నైట్ రైడర్స్ తో బెంగలూరు రాయల్ ఛాలెంజర్స్ ఒకే ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలయింది.
ఐపీఎల్ లో నిన్న జరిగిన కోల్కత్తా నైట్ రైడర్స్ తో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఒకే ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలయింది. అయితే ఎప్పుడూ చివరి ఓవర్ లలో విజృంభించే దినేష్ కార్తీక్ వల్లనే మ్యాచ్ ఓడిందన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఒక పరుగు వచ్చే అవకాశం వచ్చినా చేయకపోవడం, కరన్ శర్మకు బ్యాటింగ్ ఛాన్స్ ఇవ్వకపోవడం వల్లనే జట్టు ఓడిందని ఆర్సీబీ అభిమానులు దుమ్మెత్తి పోస్తున్నారు. నిజానికి తాను గెలిపించాలనుకున్నప్పటికీ దినేష్ కార్తీక్ వల్లనే ఓటమి పాలయిందంటూ బెంగలూరు జట్టు అభిమానులు మాత్రం ఆవేదన చెందుతున్నారకు. కరన్ శర్మకు అవకాశమిచ్చి ఉంటే గెలిచి ఉండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.
ప్లే ఆఫ్ నుంచి ...
బెంగళూరు జట్టు ప్లే ఆఫ్ నుంచి ఇక నిష్క్రమించినట్లేనని అనుకోవాలి. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కత్తా నైట్ రైడర్స్ ఇరవై ఓవర్లలో ఆరు పరుగులు కోల్పోయి 222 పరుగులు చేసింది. సాల్ట్ 48 పరుగులు చేశాడు. శ్రేయస్ అయ్యర్ 50 పరుగులు చేశాడు. రింకు 24 పరుగులు చేసి అవుట్ కావడంతో రమణ్‌దీప్ వచ్చి మిగిలన బంతుల్లో ఉతికేశాడు. దీంతో మంచి స్కోరే వవచ్చింది. సిరాజ్ ఒకటి, యశ్ దయాల్ కు రెండు వికెట్లు, గ్రీన్ కు రెండు వికెట్లు లభించాయి. ఐపీఎల్ లో మంచి స్కోరు అయినప్పటికీ బెంగలూరు జట్టులో కోహ్లి, డూప్లిసెస్ ఫాంలో ఉండటంతో లక్ష్యం పూర్తి చేసి గెలిచి ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుతారనుకున్నారు.
ఆ రన్స్ చేసి ఉంటే...
అయితే తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన బెంగళూరు జట్టు ఆదిలోనే తడబడింది. కోహ్లి 18 పరుగుల వద్ద అవుట్ కాగా, డుప్లిసెస్ ఏడు పరుగుల వద్ద వెనుదిరిగారు. అయితే తర్వాత క్రీజులోకి వచ్చి జాక్స్, పాటిదార్లు విజృంభించి ఆడటంతో ఒక దశలో జట్టు గెలుస్తుందని అనుకున్నారు. వారిద్దరూ కూడా అవుట్ కావడంతో తర్వాత వచ్చిన ప్రభుదేశాయ్ పరవాలేదనిపించాడు. దినేశ్ కార్తీక్ 25 పరుగులు చేసినా చివర్లో ఉతికేస్తాడనుకున్నారు. కానీ దినేష్ కార్తీక్ అవుట్ అయ్యాడు. అంతకు ముందు రెండు, మూడు బంతులు రన్ చేసే అవకాశం వచ్చిన సిక్సర్, ఫోర్ కోసం చేయలేదు. అదే ఆర్సీబీ జట్టు కొంప ముంచింది. కరన్ శర్మ సిక్సర్లు కొడుతూ గెలిపిస్తాడునుకున్న తరుణంలో తాను కూడా అవుటయ్యాడు. చివరి బంతికి మూడు పరుగులు చేయాల్సి ఉండగా రెండు పరుగులు చేసినా సూపర్ ఓవర్ కు అవకాశముండేది. కానీ రన్ అవుట్ కావడంతో ఒక పరుగుతో కేకేఆర్ విజయం సాధించింది. దీంతో దినేష్ కార్తీక్త్ ను ఆర్సీబీ అభిమానులు దుమ్మెత్తి పోస్తున్నారు.
Next Story