Sun Dec 22 2024 18:34:17 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2024 : భారీ లక్ష్యం కంటిముందున్నా చేతులు వణకలేదు.. బ్యాట్ పదును తగ్గలేదు
IPL 2024 : భారీ లక్ష్యం కంటిముందున్నా చేతులు వణకలేదు.. బ్యాట్ పదును తగ్గలేదు
ఐపీఎల్ లో శతకాలు కొట్టడం అంటే మామూలు విషయం కాదు. టీ 20 లలో సెంచరీ చేయడమంటే ఆషామాషీ కాదు. ఎంత వేగంగా బంతులను బౌండరీకి, సిక్సర్లకు పంపగలిగితేనే సెంచరీ సాధ్యమవుతుంది. నిన్న చెన్నై సూపర్ కింగ్స్ తో లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ మధ్య జరగిన మ్యాచ్ లోనూ ఇరు జట్లలో సెంచరీలు నమోదు చేసి మరో రికార్డు క్రియేట్ చేశారు. చెన్నైలో జరిగిన లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి పాలయింది. భారీ పరుగులు లక్ష్యం కళ్లముందు కనిపిస్తున్నా పెద్దగా తడబడలేదు..చేతులు వణకలేదు... ఒకటే మ్యూజిక్ అన్నట్లు.. వీర కొట్టుడుతో మ్యాచ్ ను లక్నో తమ వైపునకు తిప్పుకుందది.
రుతు రాజ్ సెంచరీ...
చెన్నై సూపర్ కింగ్స్ మీద గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ పాయింట్ల పట్టికలో ఎగబాకింది. రాజస్థాన్ రాయల్స్ మొదటి ప్లేస్ లో ఉండగా, కోల్కత్తా నైట్ రైడర్స్ రెండోస్థానంలో ఉంది. మూడోస్థానంలో హైదరాబాద్ సన్ రైజర్స్ ఉండగా ఇప్పుడు లక్నో సూపర్ జెయింట్స్ నాలుగో స్థానంలో ఉంది. ఐదో స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ ఉంది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇరవై ఓవర్లకు చెన్నై సూపర్ కింగ్స్ 210 పరుగులు చేసింది. సొంత మైదానం కావడంతో చెన్నై విజయం ఖాయమని అనుకున్నారంతా. చెన్నై జట్టులో రుతురాజ్ కెప్టెన్ ఇన్నింగ్స్ మరోసారి ఆడాడు. 108 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు. జడేజా 16 పరుగులు చేసి అవుట్ కాగా శివమ్ దూబే మరోసారి శివాలెత్తిపోయాడు. దుబే 66 పరుగులు చేసి ఇంతటి భారీ స్కోరును తెచ్చిపెట్టాడు. చివర్లో వచ్చిన ధోని ఒక బంతికి ఫోర్ కొట్టి స్కోరును 210 చేశాడు.
ఓటమి తప్పుదనుకున్నా...
ఐపీఎల్ లో 210 స్కోరు అంటే పెద్దదే. దానిని అధిగమించాలంటే కష్టంతో కూడుకున్న పనే. అదీ చెన్నైకి అచ్చి వచ్చిన మైదానం కావడంతో లక్నో సూపర్ జెయింట్స్ కు ఓటమి తప్పదని అందరూ అనుకున్నారు. కాని వారి అంచనాలు తలకిందులయ్యాయి. 211 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో 19.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆరంభంలో లక్నోకు భారీ దెబ్బ తగిలింది. డీకాక్ డకౌట్ అయ్యాడు. రాహుల్ 16 పరుగులకే వెనుదిరిగాడు. ఇక చూసేవారికి ఎవరికైనా చెన్నైదే విజయమని అనుకున్నారు. కానీ స్టాయినిస్ ఆట స్వరూపాన్నే మార్చేశాడు. 124 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించారు. కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి లక్నో చెన్నై సూపర్ కింగ్స్ పై విజయం సాధించింది.
Next Story