Mon Dec 23 2024 17:39:35 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2024 : కొత్త.. కెప్టెన్సీ వచ్చినా.. ...జెర్సీ ఛేంజ్ అయినా.. మరి జట్టు మారుతుందా?
ఈసారి ఐపీఎల్ సీజన్ లో సన్రైజర్స్ తమ అంచనాలను నిలబెడుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు
IPL 2024 :మరో రెండు రోజుల్లో ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభం కానుంది. సన్ రైజర్స్.. పేరులోనే రైజర్స్ కానీ గత ఐపీఎల్ లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. సన్ రైజర్స్ హైదరాబాద్కు విపరీతమైన ఫ్యాన్స్ ఉండేవారు. కానీ అది ఒకప్పుడు. కానీ ఆ టీం గత రెండు సీజన్ లో చూపించిన పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత హైదరాబాద్ జట్టు ఫైనల్స్ చేరుకోవడం మాట అటుంచి... కనీసం సెమీ ఫైనల్స్ కు చేరుకుంటుందా? అన్న అనుమానాలు కూడా బయలుదేరాయి. ఐపీఎల్ ప్రారంభమయినప్పుడు ఉన్న యాజమాన్యం ఇప్పుడు లేదు. కొత్త యాజమాన్యం ఆ జట్టును కైవసం చేసుకుని ఐపీఎల్ లో సత్తా చాటాలనుకున్నప్పటికీ సాధ్యపడటం లేదు. హైదరాబాద్ పేరుతో ఉన్న ఈ జట్టు గెలవాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి క్రికెట్ అభిమాని కోరుకుంటారు.
జట్టులో మార్పులు...
కానీ అది సాధ్యపడటం లేదు. తాజాగా ఈ జట్టులో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. వార్నర్, విలియమ్స్ వంటి దిగ్గజాలను కాదని ఇటీవల వరల్డ్ కప్ లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చూపించిన కమిన్స్ ను సన్ రైజర్స్ సొంతం చేసుకుంది. మామూలుగా కాదు. 20.5 కోట్ల రూపాయలకు కమిన్స్ ను దక్కించుకున్న యాజమాన్యం ఈ జట్టుపై అంచనాలను మరింత పెంచింది. ఐపీఎల్ 14, 15, 16 సీజన్ లలో ఈ జట్టు అసలు మైదానంలో ఆడటానికి వచ్చిందా? ఉబుసుపోక వచ్చిందా? అన్న అనుమానాలు కల్గించింది. దీంతో ఆ జట్టును వెనకేసుకొస్తున్న ఫ్యాన్స్ కూడా ఇది గెలిచేది కాదు.. అంటూ మిగిలిన జట్లకు అభిమానులుగా మారిపోయారు.
ఫామ్ లో ఉన్నోళ్లు...
సన్ రైజర్స్ టీంను ఇప్పుడు తక్కువ అంచనా వేయడానికి వీలులేదు. ఎందుకంటే ఫుల్ ఫామ్ లో ఉన్న ఆటగాళ్లు ఆ జట్టునిండా ఉన్నారు. విదేశీ ఆటగాళ్లతో పాటు స్వదేశీ ఆటగాళ్లతో జట్టు కళకళలాడుతుంది. కమిన్స్, మార్క్రమ్, ట్రావిస్ హెడ్, క్లాసెన్, గ్రెలస్ ఫిలిప్స్, హాసరంగా, యాన్సెన్, ఫజల్ హక్ వంటి ఆటగాళ్లు మాత్రమే కాకుండా నటరాజన్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ వంటి బౌలర్లు కూడా ఉన్నారు. ఈ జట్లులో ఆల్ రౌండర్లతో పాటు బ్యాటింగ్, బౌలింగ్ పరంగా బలంగానే కనిపిస్తుండటంతో ఇప్పుడు సన్ రైజర్స్ పై అంచనాలు పెరిగాయి.
Next Story