Sun Dec 22 2024 20:22:57 GMT+0000 (Coordinated Universal Time)
MS Dhoni: ధోని చేసిన డైవ్ చూశారా.. టికెట్ డబ్బులకు న్యాయం జరిగినట్లే
చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని మంగళవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో
చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని మంగళవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన క్యాచ్ పట్టాడు. డైవ్ చేసి ధోని పట్టిన అద్భుతమైన క్యాచ్ కు అభిమానులు ఫిదా అయిపోయారు. టోర్నమెంట్ ప్రారంభానికి ఒక రోజు ముందు రుతురాజ్ గైక్వాడ్‌కు CSK కెప్టెన్సీని ఇచ్చేసిన 42 ఏళ్ల ధోని, డారిల్ మిచెల్ బౌలింగ్‌లో విజయ్ శంకర్ క్యాచ్ ను అద్భుతంగా అందుకున్నాడు. విజయ్ శంకర్ షాట్ ఆడగా ఎడ్జ్ అయి.. ధోని కుడివైపుకి వెళ్ళింది. ఒక్కసారిగా ధోని ఎగిరి క్యాచ్ ను అందుకున్నాడు. ఈ క్యాచ్ తో చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలోని అభిమానులంతా ఫుల్ ఖుషీ అయ్యారు. ఈమ్యాచ్ లో ధోని బ్యాటింగ్ కు వస్తాడని ఎదురుచూసిన అభిమానులకు నిరాశ ఎదురైనప్పటికీ.. కళ్ళు చెదిరే క్యాచ్ పట్టి అభిమానులకు స్వీట్ సర్ ప్రైజ్ ఇచ్చాడు.
గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మెన్ మొదట అద్భుతంగా ఆడారు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 206 పరుగులు చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 36 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ తో 46 పరుగులు చేయగా, రచిన్ రవీంద్ర 20 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 సిక్సులతో 46 పరుగులు సాధించాడు. శివమ్ దూబే 23 బంతుల్లో 51 పరుగులు చేశాడు. అతడి స్కోరులో 2 ఫోర్లు, 5 భారీ సిక్సులు ఉన్నాయి. డారిల్ మిచెల్ 24 పరుగులు, సమీర్ రిజ్వి 6 బంతుల్లో 2 సిక్సులతో 14 పరుగులు చేశాడు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో రషీద్ ఖాన్ 2, సాయికిశోర్ 1, స్పెన్సర్ జాన్సన్ 1, మోహిత్ శర్మ 1 వికెట్ తీశారు. ఇక ఛేజింగ్ లో గుజరాత్ టైటాన్స్ ఏ దశలోనూ లక్ష్యాన్ని చేరుకునేలా కనిపించలేదు.
Next Story