Fri Dec 20 2024 19:59:30 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2024 : ఇంత వన్ సైడ్ మ్యాచ్ ఈ ఐపీఎల్ లో ఈ మధ్యకాలంలో చూడలేదు
కోల్కత్తా నైట్ రైడర్స్ తో ఢిల్లీ కాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ వన్ సైడ్ గా జరిగిందనే చెప్పాలి
ఐపీఎల్ లో కొన్ని జట్లు తొలి నుంచి అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నాయి. రాజస్థాన్ రాయల్స్, కోల్కత్తా నైట్ రైడర్స్ తమ ఆధిపత్యాన్ని ఈ సీజన్ లో ప్రతి మ్యాచ్ లో ప్రదర్శిస్తూనే వస్తున్నాయి. అప్పుడప్పుడూ ఒకటో రెండో ఓటములు ఎదురయినా ఇప్పటి వరకూ అయితే ఈ రెండు జట్లు దాదాపు ప్లే ఆఫ్ కు వెళ్లేందుకు దాదాపు రెడీ అయిపోయాయి. మిగిలిన రెండు జట్లు ఏంటన్నది మాత్రమే తేలాల్సి ఉంది. కోల్కత్తా నైట్ రైడర్స్ ఆరు విజయాలను దక్కించుకుంది. మూడు మ్యాచ్ లలో ఓడిపోయింది. కేకేఆర్ ఇక పెద్దగా కష్టపడాల్సిన పనిలేకుండానే ప్లే ఆఫ్ కు చేరుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
స్వల్ప స్కోరుతో...
నిన్న జరిగిన కోల్కత్తా నైట్ రైడర్స్ తో ఢిల్లీ కాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ వన్ సైడ్ గా జరిగిందనే చెప్పాలి. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ కాపిటల్స్ జట్టు బ్యాటర్లు అందరూ విఫలమయ్యారు. ఓపెనర్ దగ్గర నుంచి అందరూ వరస బెట్టి పెవిలియన్ బాట పట్టారు. కులదీప్ యాదవ్ చివరలో మెరుపులు మెరిపించడం వల్లనే ఆ మాత్రమైనా స్కోరు దక్కింది. ఐపీఎల్ లో అందులోనూ కేకేఆర్ ముందు అంత స్వల్ప లక్ష్యం ఉంచి ఇక ఢిల్లీ ఎలా గెలుస్తుందన్ని అంచనాలు తొలి నుంచి వినిపిస్తూనే ఉన్నాయి. ఇరవై ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 153 పరుగులు మాత్రమే చేసింది. అందులో కులదీప్ యాదవ్ ఒక్కడే అత్యధిక స్కోరు చేసింది.
లక్ష్య సాధనలో...
తర్వాత లక్ష్య సాధనలో బరిలోకి దిగిన కోల్్కత్తా నైట్ రైడర్స్ పెద్దగా శ్రమపడలేదు. సాల్ట్ 68 పరుగులు చేశాడు. నరేన్ పదిహేను పరుగులకే అవుటయినా రికంకూ సింగ్ పదకొండు పరుగులు, శ్రేయస్ అయ్యర్ 33 పరుగులు చేశాడు. వెంకటేశ్ అయ్యర్ 26 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. ఏడు వికెట్ల తేడాతో కోల్ కత్తా నైట్ రైడర్స్ విజయం సాధించింది. దీంతో కోల్కత్తా నైట్ రైడర్స్ ప్లేఆఫ్ కు మార్గం సుగమం చేసుకోగా, ఢిల్లీ దాదాపు ప్లేఆఫ్ కు చేరుకోవడం కష్టమేనని చెప్పాలి.
Next Story