Fri Nov 22 2024 22:40:43 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2024 : ఆర్సీబీ పై పెరుగుతున్న భారీ అంచనాలు... వత్తిడి తీవ్రమయితే ఎలా?
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఈరోజు రాజస్థాన్ రాయల్స్ తో ఎలిమినేషన్ మ్యాచ్ లో తలపడుతుంది
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఈరోజు రాజస్థాన్ రాయల్స్ తో ఎలిమినేషన్ మ్యాచ్ లో తలపడుతుంది. ఈ మ్యాచ్ లో ఓడిపోతే ఇక తప్పుకున్నట్లే. మరొక ఛాన్స్ లేదు. అందుకే రెండు జట్లపై వత్తిడి ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. నిన్నటి మ్యాచ్ చూస్తే హైదరాబాద్ సన్ రైజర్స్, కోల్కత్తా నైట్ రైడర్స్ మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. అయితే ఈ మ్యాచ్ లో ఎవరిపై వత్తిడి లేదు. ఎందుకంటే ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్స్ కు వెళుతుందనే ఒకే ఒక కారణం తప్పించి ఓటమి పాలయిన జట్టుకు కూడా మరొక అవకాశం ఉంటుంది. రెండో క్వాలిఫయిర్ లో గెలిచిన జట్టుపై ఆడే అవకాశముండటంతో అంత వత్తిడిని వారు ఎదుర్కొనలేదు.
అత్యధికంగా ఫ్యాన్స్...
అయితే ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ కంటే బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ పైనే వత్తిడి ఎక్కువగా ఉంది. ఎక్కువ మంది అభిమానులున్న జట్టు అది. విరాట్ కోహ్లి ఉండటంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండటంతో అందరూ బెంగళూరు గెలవాలని కోరుకుంటారు. ఫైనల్ లో విరాట్ ను చూడాలని, ఈసారి ఛాంపియన్స్ గా బెంగళూరు నిలవాలని ఎప్పటి నుంచో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. దానికి తగ్గట్లుగానే తొలి మ్యాచ్ లలో ఓటమి పాలయినా తర్వాత తేరుకుని ప్లే ఆఫ్ కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేరుకుంది. విరాట్ కూడా ఎలాగైనా ఐపీఎల్ ఒకసారి ఛాంపియన్ గా తమ జట్టును నిలపాలని భావిస్తున్నారు. గవాస్కర్ నుంచి సీనియర్ క్రికెటర్లు అందరూ ఆర్సీబీ విజయం సాధిస్తుందని చెబుతూ మరింత వత్తిడి జట్టుపై పెంచుతున్నారు.
బౌలర్లకు ప్రతి బంతీ...
అందుకే వత్తిడి ఎక్కువగా ఉంది. ఈ సీజన్ లో ఆర్సీబీపై అంచనాలు లేకపోయినా వరస గెలుపులతో అభిమానుల్లోనూ ఛాంపియన్ గా నిలవాలన్న ఆశను పెంచేలా చేశారు. దీంతో విరాట్ జట్టు పై విపరీతమైన ఆశలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. విరాట్ కోహ్లి, డూప్లెసిస్ పది ఓవర్లు నిలబడితే చాలు గెలిచినట్లేనన్న అంచనాల్లో ఉన్నారు. బ్యాటింగ్ పైన కంటే బెంగళూరు జట్టు బౌలర్లపైనకూడా వత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ మ్యాచ్ లో ప్రతి పరుగు కీలకమే. అందుకే ప్రతి బంతికి బౌలర్ తీవ్రమైన వత్తిడిని ఎదుర్కొనక తప్పదు. అయితే అదే సమయంలో రాజస్థాన్ రాయల్స్ కూడా వత్తిడిని ఎదుర్కొంటుంది. వరసగా నాలుగు ఓటములతో అది కొంచెం ఇబ్బంది పడుతుంది. దీంతో రెండు జట్లు పైన తీవ్ర వత్తిడి ఉంది. మరి ఈరోజు మైదానంలో ఎవరు చెలరేగి ఆడతారన్నదిచూడాలి.
Next Story