Sun Dec 22 2024 22:26:02 GMT+0000 (Coordinated Universal Time)
Sun Risers : సన్ రైజర్స్ కే కాదు.. రాయల్స్ కు కూడా రేపు చావో రేవో
సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ రేపు జరిగే క్వాలిఫయిర్ మ్యాచ్ లో గెలిస్తేనే ఫైనల్స్ లోకి ప్రవేశిస్తుంది
సన్ రైజర్స్ హైదరాబాద్ కు రేపు చావో రేవో అన్నట్లు ఉంది. రేపు జరిగే క్వాలిఫయిర్ మ్యాచ్ లో గెలిస్తేనే ఫైనల్స్ లోకి ప్రవేశిస్తుంది. రేపు చెన్నైలో రాజస్థాన్ రాయల్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడుతుంది. ఇది క్వాలిఫయిర్ చివరి మ్యాచ్ కావడంతో ఈమ్యాచ్ లో గెలిచిన జట్టు ఫైనల్స్ కు చేరుకుంటుంది. ఇప్పటికే కోల్కత్తా నైట్ రైడర్స్ ఫైనల్స్ కు చేరకుంది.
ఫైనల్స్ కు వెళ్లాలంటే...
అయితే బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మీద గెలిచి రాజస్థాన్ రాయల్స్ కొంత ఊపులో ఉంది. కోల్కత్తా నైట్ రైడర్స్ మీద ఓటమి పాలయి సన్ రైజర్స్ కొంత డీలా పడింది. ఇరుజట్లు బలంగానే ఉన్నాయి. అయితే చెన్నై చెపాక్ స్టేడియం తమకు కలసి వస్తుందని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ కమిన్స్ చెబుతున్నారు. మొత్తం మీద రేపు ఫైనల్స్ కు ఎవరు చేరతారన్నది తేలనుంది. రెండు జట్లకు సమాన అవకాశాలున్నాయన్నది క్రీడా నిపుణుల అంచనాగా వినిపిస్తుంది.
Next Story