Mon Dec 23 2024 08:39:28 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2024 : కావ్య పాప.. ఫుల్లు ఖుషీ.. ఎగిరి గంతేయడం ఒక్కటే తక్కువ
నిన్న సన్ రైజర్స్ మ్యాచ్ చూస్తూ ఆ జట్టు యజమాని కావ్య స్టేడియంలో సంబరపడిన దృశ్యం అందరినీ కట్టిపడేసింది
నిన్న సన్ రైజర్స్ మ్యాచ్ చూస్తూ ఆ జట్టు యజమాని కావ్య స్టేడియంలో సంబరపడిన దృశ్యం అందరినీ కట్టిపడేసింది. తొలి మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ పెద్దగా పెర్ఫర్మెన్స్ చేయలేదు. ఆరోజు స్టేడియంలో కావ్య ముభావంగా కనిపించారు. తమ జట్టుకు చెందిన బౌలర్లు ఎక్కువ పరుగులు ఇచ్చిన సమయంలోనూ, అలాగే బ్యాటర్లు అవుటయిన సమయంలోనూ ఆమె మూడీగా కనిపించారు. జట్టు జెర్సీని, కెప్టెన్సీని మార్చినా ఫేట్ మాత్రం కావ్యకు మారలేదంటూ నెట్టింట అనేక మంది సెటైర్లు కూడా వేశారు.
కానీ నిన్న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ముంబయి ఇండియన్స్తో జరిగిన మ్యాచ్ లో మాత్రం కావ్య ఒక్క నిమిషం కూడా కుదురుగా కూర్చోలేదంటే నమ్మశక్యం కాదు. ప్రతి ఫోర్ కు సీటులో నుంచి లేచి మరీ చప్పట్లు కొట్టారు. ప్రతి సిక్సర్ కు ఆమె ఎగిరి గంతేసి తన ఆనందాన్ని తోటి స్నేహితులతో పంచుకున్నారు. తమ జట్టు బ్యాటర్లు ఊచకోత కోస్తుంటే కావ్య పాప కుదురుగా కూర్చోలేకపోయింది. ప్రతి బాలు బౌండరీ లైన్ దాటి పైకి వస్తుండటంతో ఆసక్తికగా చూస్తూ జట్టు సభ్యులను ఎంకరేజ్ చేస్తూ కనిపించింది. దీంతో చాన్నాళ్లకు కావ్యపాప ముఖంలో ఆనందం చూశామంటున్నారు నెటిజన్లు.
Next Story