Mon Dec 23 2024 16:38:17 GMT+0000 (Coordinated Universal Time)
ఎవరీ బదోనీ... దుమ్ము రేపుతున్నాడుగా?
ఐపీఎల్ లో ఆయుష్ బదోని ఇప్పుడు హట్ టాపిక్ గా మారారు. ఎవరీ బదోని అంటూ నెటిజన్లు గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు
ఐపీఎల్ నుంచి అనేక మంది క్రికెెటర్లు అంతర్జాతీయ మ్యాచ్ లో అడుగుపెట్టారు. అండర్ 19లో రాని గుర్తింపు ఐపీఎల్ లో లభిస్తుంది. అదే వారికి వరంగా మారుతుంది. కానీ వారిని గుర్తించడమే కష్టం. కానీ అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు. తన్నుకుంటూ కొందరి విషయంలో వస్తుంది అంతే. అదే ఇప్పుడు ఆయుష్ బదోనీ విషయంలో నిజమయింది. ఐపీఎల్ 2022లో ఆయుష్ బదోని ఇప్పుడు హట్ టాపిక్ గా మారారు. ఎవరీ బదోని అంటూ నెటిజన్లు గూగుల్ లో వెతుకుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు.
లక్నో సూపర్ జెయింట్స్ కు...
ఆయుష్ బదోని ప్రస్తుతం లక్నో సూపర్ జెయింట్స్ లో ఆడుతున్నాడు. అతనిని కేవలం ఇరవై లక్షలకే లక్నో సొంతం చేసుకుంది. తక్కువ ధర అయిన ఆయుష్ బదోని పెద్దగా కుంగిపోలేదు. తన ఆటను ప్రదర్శించే సమయం వచ్చిందని రెడీ అయిపోయాడు. అనుకున్నట్లుగానే జరిగింది. చిన్న వయసులో 360 డిగ్రీల్లో గ్రౌండ్ మొత్తం బాదుతున్న ఆదోని సెలక్టర్ల దృష్టిలో పడతాడంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు.
గౌతమ్ గంభీర్.....
ఐపీఎల్ లోకి వచ్చేందుకు బదోనీ తెగ కష్టపడ్డాడు. కానీ ఏ టీమ్ అతనిని సొంతం చేసుకునే సాహసం చేయలేదు. ఢిల్లీకి చెందిన ఆయుష్ బదోనిలోని ప్రతిభను మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ గుర్తించాడు. లక్నో మెంటర్ గా వ్యవహరిస్తున్న గౌతమ్ గంభీర్ బదోనిని వెతికి పట్టుకున్నాడు. నీ స్టయిల్ లో ఆడమని ప్రోత్సహించాడు. ఫలితమే సిక్సర్లు.. ఫోర్లు. బదోని ఇప్పుడు పెద్ద పెద్ద క్రికెటర్ల నోళ్లలో నానుతున్నాడు. అంటే బదోనికి భవిష్యత్ మామూలుగా ఉండదన్నది ఐపీఎల్ మ్యాచ్ లు చూసే వారు ప్రతి ఒక్కరికీ తెలుస్తోంది.
Next Story