Fri Dec 20 2024 05:36:44 GMT+0000 (Coordinated Universal Time)
బెంగళూరుదే ఘన విజయం
బెంగళూరు జట్టు తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో గెలిచింది. రాజస్థాన్ రాయల్స్ పై 112 పరుగుల తేడాతో విజయం సాధించింది.
బెంగళూరు జట్టు తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో గెలిచింది. రాజస్థాన్ రాయల్స్ పై 112 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ప్లేఆఫ్ ఆశలు ఇప్పుడు బెంగుళూరు జట్టుకు నిలిచాయి. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు ఐదు వికెట్లు కోల్పోయి కేవలం 171 పరుగులు మాత్రమే చేసింది. వాస్తవానికి ఇది పెద్ద లక్ష్యమేమీ కాదు. అందులో రాజస్థాన్ రాయల్స్‌కు ఇది అతి తక్కువ స్కోరు.
అతి తక్కువ స్కోరుకు...
అయితే ఛేదనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆది నుంచే తడబడింది. కేవలం 59 పరుగులకే రాజస్థాన్ రాయల్స్ ఆల్ అవుట్ అయింది. హెట్ మెయర్ ఒక్కరే 35 పరుగులు చేశారు. మిగిలిన వారంతా తక్కువ స్కోరుకే అవుటయ్యారు. మ్యాక్స్‌వెల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. 54 పరుగులు చేయడమే కాకుండా, ఒక వికెట్ తీసుకున్న మ్యాక్స్ వెల్‌ను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపిక చేశారు.
Next Story