Sun Nov 17 2024 17:26:17 GMT+0000 (Coordinated Universal Time)
తడబడుతున్న పంజాబ్.. బెంగళూరుకు అప్పగిస్తారా?
బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, పంజాబ్ కింగ్స్ మధ్య పోరు ఆసక్తికరంగా సాగుతుంది
బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, పంజాబ్ కింగ్స్ మధ్య పోరు ఆసక్తికరంగా సాగుతుంది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు ఇరవై ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. అందులో ఎసుపనకలే విరాట్ కొహ్లి, డూప్లిసెస్లు ఇద్దరూ అర్థ సెంచరీ పూర్తి చేశారు. కేవలం పన్నెండు ఓవర్లలోనే వంద పరుగులు పూర్తి చేసిన బెంగళూరు జట్టు తర్వాత స్కోరు నెమ్మదించడంతో 174 మాత్రమే చేయగలిగింది. కొహ్లి 47 బాల్స్లో 54 పరుగులు చేసి తర్వాత అవుట్ అయ్యారు. 137 పరుగుల వద్ద అవుట్ అయిన తర్వాత పెద్దగా పరుగులు చేయలేకపోయింది.
తడబడుతూనే...
తర్వాత బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ ఆది నుంచి తడబడుతుంది. ప్రస్తుతం ఏడు వికెట్లు కోల్పోయి ౧౦౬ పరుగులు చేసింది. మరో తొమ్మిది ఓవర్లున్నప్పటికీ స్కోరు బోర్డు నెమ్మదిగా సాగుతుండటం, వికెట్లు పడుతుండటంతో కొంత పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లకు ఇబ్బందిగా మారింది. ప్రభాసిమ్రాన్ ఒక్కడే నిలదొక్కుకుని అర్థ సెంచరీకి మూడు పరుగులు దూరంలో అవుట్ కావడంతో పంజాబ్ గెలుపు ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. అయితే ఐపీఎల్లో ఏదైనా జరగొచ్చు కాబట్టి చివరి నిమిషంలో మ్యాచ్ ఎవరి పరం అవుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
Next Story