Sun Nov 17 2024 21:30:04 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2023 : మార్పులతో.. కొత్తగా.. మరింత ఉత్సాహంగా
ఈ ఐపీఎల్ సీజన్లో కొన్ని మార్పుల చేస్తూ బీసీీసీఐ నిర్ణయం తీసుకుంది. తాజా మార్పులతో మరింత మజా తోడుకానుంది
ఐపీఎల్ 2023 ప్రారంభం కాబోతుంది. ఇక ఫ్యాన్స్‌కు క్షణం తీరికుండదు. అలసి పోయి ఆఫీసు నుంచి వచ్చిన వారికి ఐపీఎల్ రేపటి నుంచి కనువిందు చేయనుంది. అయితే ఈ ఐపీఎల్ సీజన్లో కొన్ని మార్పుల చేస్తూ బీసీీసీఐ నిర్ణయం తీసుకుంది. తాజా మార్పులతో మరింత మజా తోడుకానుంది. మ్యాచ్‌లు కూడా రంజుగా జరగనున్నాయి. మొన్నటి వరకూ టాస్ వేయడానికి ముందు టీంను ఎంపిక చేసుకుని ఇరుజట్లు సమర్పించాలి. ఇకపై టాస్‌ను బట్టి జట్టు కూర్పును చేయవచ్చు. పిచ్ రిపోర్ట్‌ను బట్టి బౌలర్లు ఎక్కువ కావాలా? బ్యాటర్లు ఎక్కువ మంది ఉండాలా? అన్నది టాస్ తర్వాత నిర్ణయించుకునే వీలుంది. అంతకు ముందు జట్టును ప్రకటించినప్పటికీ టాస్ తర్వాత మార్పు చేసుకునే వీలు కల్పించింది.
భారీ మూల్యం....
ఇక బౌలర్ తనకు నిర్దేశించిన సమయంలో ఓవర్ పూర్తి చేయకుంటే పెనాల్టీలోనూ బీసీసీఐ మార్పులు చేసింది. బౌలర్ లేట్ గా ఓవర్ వేస్తే ముప్ఫయి యార్డుల వెలుపల నలుగురి ఫీల్డర్లను మాత్రమే అనుమతిస్తారు. అలాగే బ్యాటింగ్ చేసే సమయంలో ప్రత్యర్థి ఫీల్డర్, కానీ వికెట్ కీపర్ కాని కదిలినా, పొజిషన్ మార్చుకున్నా బంతిని డెడ్‌బాల్ ప్రకటించి బ్యాటింగ్ చేస్తున్న జట్టుకు ఐదు పరుగులు జోడిస్తారు. ఈ నిబంధనతో ఫీలర్లు, వికెట్ కీపర్లు జాగ్రత్తలు తీసుకోకుంటే భారీ మూల్యం చెల్లించక తప్పదు. ఒక్కోసారి ఆ ఐదు పరుగులే పరాజయానికి కారణమవుతాయి. ఒక్క రన్ తో ఓడిపోయిన జట్లు గత సీజన్లలో చూశాం. దీంతో ఫీల్డ్‌లో ఉన్నవారంతా ఒళ్లు దగ్గర పెట్టుకోవాల్సిందే.
ఇంపాక్ట్ ప్లేయర్...
ఇక కొత్తగా ఈసారి ఇంపాక్ట్ ప్లేయర్ ను బీసీసీఐ ఇంట్రడ్యూస్ చేసింది. తుది జట్టులోని ఓ ఆటగాడిస్థానంలో మరో ప్లేయర్‌ను ఆడించే వీలుంది. ఈ నిబంధన బ్యాటింగ్‌కే కాదు.. బౌలింగ్ కు కూడా వర్తిస్తుంది. జట్టును ప్రకటించే ముందే నలుగురు సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ల నుచేర్చాలి. వారి నుంచే ఇంపాక్ట్ ప్లేయర్ ను ఎంపిక చేసుకునే వీలు కల్పించింది. ఈ నిబంధనతో తమకు అవసరమైన ఆటగాడిని జట్టుకు కల్పించింది బీసీసీఐ. ఇన్నింగ్స్ ఆరంభానికి ముందు, ఓవర్ ముగిసిన తర్వాత గాని, వికెట్ పడిన తర్వాత గాని, ప్లేర్ రిటైర్ అయి వెనుదిరిగిన తర్వాత కానీ ఇంపాక్ట్ ప్లేయర్ ను గ్రౌండ్లోకి దించే వీలుంది. అయితే ఓవర్ మధ్యలో మాత్రం కుదరదు. ఇంపాక్ట్ ప్లేయర్ గా భారత్ ఆటగాడిని మాత్రమే ఎంపిక చేసుకోవాలన్న షరతు మాత్రం ఉంది.
రివ్యూల విషయంలో...
ఇక సమీక్ష విధానంలో కూడా బీసీసీఐ మార్పులు చేసింది. ఇప్పటి వరకూ ఎల్బీడబ్ల్యూ అయితే రివ్యూకు వెళ్లే అవకాశముంది. ఇక అలా కాదు. నో బాల్స్, వైడ్ బాల్స్ కు కూడా ఈ ఐపీఎల్్లో రివ్యూలు తీసుకునే వీలు కల్పించారు. బ్యాటర్ నడుం పైకి బంతి వెళితే దాన్ని నో బాల్ గా అంపైర్లు ప్రకటిస్తారు. దానిపై రివ్యూకు వెళ్లే అవకాశాన్ని కల్పించారు. ఇక నో బాల్, వైడ్ బాల్స్ కు కూడా రివ్యూలు కోరే ఛాన్స్‌ను కల్పించారు. ఇలా నిబంధనలను మారుస్తూ ఈ ఐపీఎల్ సీజన్ ను మరింత ఉత్కంఠ భరితంగా సాగేలా బీసీసీఐచర్యలు తీసుకుంది. రేపటి నుంచి క్రికెట్ ఫ్యాన్స్ కు ఇక మాజాయే.
Next Story